కేంద్ర బడ్జెట్ 2020-21.. కేటాయింపులు ఇలా

  • Published By: madhu ,Published On : February 1, 2020 / 07:02 AM IST
కేంద్ర బడ్జెట్ 2020-21.. కేటాయింపులు ఇలా

కేంద్ర బడ్జెట్ 2020-21 సంవత్సరానికి ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా పలు రంగాలకు కేటాయింపులు చేశారు. మూడు సిద్ధాంతాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగిందన్నారు. మొదటిది : అందరికీ మెరుగైన జీవనం అందించడం. రెండోది : అందరికీ ఆర్థిక స్వావలంబన అందించడం. మూడోది : అందరికీ సంక్షేమ ఫలాలు అందించడం. 

* విద్యా రంగానికి రూ. 99 వేల 300 కోట్లు. 
* ఆయుష్మాన్ భారత్‌కు రూ. 6 వేల కోట్లు. 
* వ్యవసాయ రంగానికి : రూ. 1.6 లక్షల కోట్లు. 

* గ్రామీణాభివృద్ధి రంగానికి : రూ. 1.23 లక్షల కోట్లు. 
* స్వచ్చభారత్ కు : రూ. 12, 300 కోట్లు
* నైపుణ్యాభివృద్ధి : రూ. 3 వేల కోట్లు.

* జలజీవన్ మిషన్‌కు : రూ. 3.06 కోట్లు. 
* ప్రధాని జన ఆరోగ్య యోజన పథకం : రూ. 6, 400 కోట్లు.
* ఆరోగ్య రంగం : రూ. 69 వేల కోట్లు. 

* పారిశ్రామికాభివృద్ధి : రూ. 27 వేల 300 కోట్లు. 
* విద్యుత్ : రూ. 22 వేల కోట్లు. 
* రవాణా రంగం : రూ. 1.7 లక్షల కోట్లు. 

* భారత్ నెట్ : రూ. 6 వేల కోట్లు.
* నేషనల్ టెక్స్ టైల్ మిషన్‌కు రూ. 1480 కోట్లు. 
* బెంగళూరులో సబర్బన్ రైల్వే వ్యవస్థకు రూ. 18 వేల 600 కోట్లు. 

* మౌలిక వసతుల ప్రాజెక్టులు : రూ. 1.03 లక్షల కోట్లు.
* ఎస్సీల సంక్షేమానికి : రూ. 85 వేల కోట్లు. 
* వయో వృద్దుల సంక్షేమానికి రూ. 9, 500 కోట్లు. 
 

* ఎస్టీల సంక్షేమానికి రూ. 53, 700 కోట్లు. 
* మహిళా సంక్షేమానికి రూ. 28, 600 కోట్లు.
* పర్యాటక శాఖకు రూ. 2, 500 కోట్లు. 

Read More : ఏప్రిల్ నుంచి GST కొత్త విధానం..చేతి ఖర్చుల్లో 4 శాతం ఆదా – నిర్మలా