Central Cabinet : కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద గోదాం ఏర్పాటు

దేశంలో ఎంపిక చేసిన పది జిల్లాలలో ప్రయోగాత్మకంగా తొలుత గోదాంల ఏర్పాటు చేయనుంది. వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల నిల్వ కోసం గోదాంల ఏర్పాటు చేయనున్నారు.

Central Cabinet : కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద గోదాం ఏర్పాటు

Central Government

Central Cabinet Key Decisions : కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సహకార రంగంలో ప్రపంచంలోనే అతి పెద్ద గోదాం ఏర్పాటుకు కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. పలు మంత్రిత్వ శాఖల భాగస్వామ్యం కోసం ఇంటర్ మినిస్టిరియల్ కమిటీ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

దేశంలో ఎంపిక చేసిన పది జిల్లాలలో ప్రయోగాత్మకంగా తొలుత గోదాంల ఏర్పాటు చేయనుంది. వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల నిల్వ కోసం గోదాంల ఏర్పాటు చేయనున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో గోదాంల ఏర్పాటు జరుగనుంది.

Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. కేంద్రం కీలక నిర్ణయం

సిటీస్ అనే నూతన పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సర్క్యూలర్ ఎకానమీ, వేస్ట్ మేనేజ్ మెంట్, వాతావరణ సంస్కరణలకు ప్రాధాన్యత ఇచ్చే నగరాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయనుంది.