ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం

  • Edited By: veegamteam , October 15, 2019 / 12:51 PM IST
ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం

ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. (అక్టోబర్‌ 21, 2019) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. (అక్టోబర్‌ 21, 2019) హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు 17 రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరుగనున్నాయి. 

ఈక్రమంలో పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సంభాషణలు, ఒపీనియన్‌ పోల్‌, పోల్‌ సర్వే లాంటి విషయాలను ప్రస్తావించడాన్ని నిషేధిస్తున్నట్లు ఈసీ తెలిపింది. హర్యానాలో 99, మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల ఫలితాలు (అక్టోబర్‌ 24, 2019) వెలువడనున్నాయి.