ఓటు వేసిన అరుణ్ జైట్లీ, అద్వానీ

  • Published By: veegamteam ,Published On : April 23, 2019 / 08:58 AM IST
ఓటు వేసిన అరుణ్ జైట్లీ, అద్వానీ

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అహ్మదాబాద్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే బీజేపీ సీనియర్‌ నాయకుడు ఎల్‌కే అద్వానీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని షాహపూర్‌ హిందీ స్కూల్ లో  అద్వానీ ఓటేశారు. కాగా 2014 ఎన్నికలల్లో గాంధీనగర్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన అద్వానీ ఎంపీగా ఉన్న గాంధీనగర్ స్థానాన్ని ఈ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు కేటాయించారు. అద్వానీకి ఈ ఎన్నికల్లో చోటు దక్కకపోవడంపై పలు విమర్శలు  కూడా వచ్చిన విషయం తెలిసిందే. . 

 

కాగా షాహపూర్‌ హిందీ స్కూల్ లో 75 ఏళ్లు పైబడినవారు..మరికొందరు ముఖ్య నేతలకు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కలేదు. గర్వాల్ ఎంపీ బీసీ ఖండూరి (84), నైనితాల్ ఎంపీ భగత్ సింగ్ కోష్యారీ (76), గుజరాత్ ఎంపీ బిజోయ చక్రవర్తి (79)లకు కూడా టికెట్లు దక్కలేదు. కాగా బీజేపీ పార్టీలో అద్వానీ పాత్ర చాలా కీలకం. 1990లో రథయాత్రను చేపట్టి బీజేపీని అధికారంలోకి తీసుకురావటంలో అద్వానీ అత్యంత కీలక పాత్ర పోషించారు. ఆనాటి ఎన్నికల్లో అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది ఎన్నికల ప్రధాన ఎన్నికల ఆయుధంగా మారింది. నాలుగుసార్లు రాజ్యసభకు, ఏడుసార్లు లోక్‌సభకు అద్వానీ ఎన్నికయ్యారు. ఉప ప్రధానితోపాటు హోంమంత్రిలాంటి కీలకమైన మంత్రిత్వ శాఖల బాధ్యతలను అద్వానీ నిర్వర్తించారు.