పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2021లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించింది.

  • Edited By: veegamteam , February 11, 2020 / 01:49 AM IST
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2021లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించింది.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2021లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించింది. కాంట్రాక్ట్‌ నిర్వహణ సమస్య వల్లే నిర్మాణంలో జాప్యం జరుగుతోందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చుపై ఆడిట్‌ పూర్తయ్యాకే నిధులు కేటాయిస్తామని స్పష్టం చేసింది. గతంలో ఈ ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేయాలని విధించిన గడువును 2021 నాటికి పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 

ఖర్చుపై ఆడిట్‌ పూర్తయ్యాకే ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు 
ప్రాజెక్టులో వివిధ భాగాల కాంట్రాక్టు నిర్వహణ కారణాలతో గడువు పొడిగించినట్టు తెలిపింది. 2018- 19లో ప్రాజెక్టు కోసం 3047 కోట్లు ఖర్చు చేశారని… అందులో కేంద్రం 1400 కోట్లు నిధులు రాష్ట్రానికి ఇచ్చిందని తెలిపింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సెంటర్, వాటర్ కమిషన్ ప్రతిపాదనల మేరకు కేంద్రం ఇప్పటి వరకు 8 వేల 614 కోట్లు విడుదల చేసిందని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుల ఆడిట్ జరగకుండా నిధులు విడుదల చేసే ప్రసక్తి లేదని ఆర్థికశాఖ నవంబర్ 26, 2019న నోట్ ఇచ్చినట్టు కేంద్రం స్పష్టం చేసింది.

పోలవరం పనులు ఆగిపోయాయంటూ తప్పుడు ప్రచారం : మంత్రి అనిల్ 
పోలవరం పనులు ఆగిపోయాయంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొస్తే వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదని, కేవలం కొందరు తప్పుడు వార్తలే రాస్తున్నారని విమర్శించారు. రివర్స్ టెండరింగ్‌లో సుమారు 850 కోట్లు ఆదా చేశామని అనిల్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. కొన్ని పునరావాస సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా పరిష్కరిస్తామన్నారు. ఇటీవల అనిల్ కుమార్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం ప్రాజెక్టులోని రాక్‌ఫిల్ డ్యామ్‌లో గ్యాప్-3కి శంకుస్థాపన చేశారు. 2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు పనుల్ని నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్
మరోవైపు పోలవరం ప్రాజెక్టు పనుల్ని నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలైంది. ఒడిశా ప్రభుత్వం మొత్తం 71 పేజీల అఫిడవిట్‌ను అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించింది. ఒడిశా పోలవరం ప్రాజెక్టు దగ్గర గరిష్ట వరద ప్రవాహం ఆంధ్రప్రదేశ్ చెప్పిన దాని కంటే చాలా ఎక్కువగా ఉందని పోలవరం ముంపు విషయంలో స్పష్టత లేదని అఫిడవిట్‌లో పేర్కొంది.