Big Decision: డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌(RC), వాహనాల అనుమతి రెన్యువల్(చెల్లుబాటు గడువు పొడగింపు) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Big Decision: డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

Driving Licence (1)

Big Decision: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌(RC), వాహనాల అనుమతి రెన్యువల్(చెల్లుబాటు గడువు పొడగింపు) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా ఈ డాక్యుమెంట్లను రెన్యువల్ చేసుకోవడానికి అక్టోబర్ 31వ తేదీ వరకు సమయం ఇచ్చింది. ఈ గడువు ఇకపై పొడిగించే అవకాశమే లేదని ప్రకటించింది కేంద్రం. ఈ నిర్ణయంతో డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్, వెహికల్ పర్మిట్ రెన్యువల్ చేయడానికి కేవలం 18 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వ రవాణా మంత్రిత్వ శాఖ ఈమేరకు నిర్ణయం తీసుకోగా.. అక్టోబర్ 31వ తేదీ తర్వాత అసంపూర్తి డాక్యుమెంట్‌లతో డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడితే, జరిమానా భారీగా చెల్లించాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి కారణంగా, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్ సహా అవసరమైన పత్రాలను రెన్యువల్ చేసుకునేందుకు ప్రభుత్వం మినహాయింపు ఇస్తూ వచ్చింది.

వాస్తవానికి వాహనాలకు సంబంధించిన పత్రాల గడువు ముగిసినా కూడా కరోనా కారణంగా ఫిబ్రవరి 2020 నుంచి ఇప్పటివరకు చెల్లుబాటు అయ్యేలా గతంలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. కానీ 31 అక్టోబర్ 2021 తర్వాత అది గడువు ముగిసినట్లుగా స్పష్టం చేసింది రవాణాశాఖ.

కరోనా కారణంగా, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సి, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ వంటి డాక్యుమెంట్ల చెల్లుబాటును ఇప్పటివరకు 7సార్లు పెంచారు. 30 మార్చి 2020, 9 జూన్ 2020, 24 ఆగస్టు 2020, 27 డిసెంబర్ 2020, 26 మార్చి 2021, 17 జూన్ 2021 చివరిసారిగా 30 సెప్టెంబర్ 2021 న మంత్రిత్వ శాఖ చెల్లుబాటును పొడిగించింది. ఇందుకోసం మోటార్ వాహనాల చట్టంలో కూడా మార్పులు తీసుకుని వచ్చింది.