కోవిడ్‌-19 జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టాలని కేంద్రం నిర్ణయం..హైదరాబాద్‌ నుంచి 2 సంస్థలు ఎంపిక

కోవిడ్‌-19 జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టాలని కేంద్రం నిర్ణయం..హైదరాబాద్‌ నుంచి 2 సంస్థలు ఎంపిక

Central Government decides to undertake sequencing of covid-19 genome : దేశ వ్యాప్తంగా కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల శాంపిల్స్‌పై జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలోని మొత్తం 10 ల్యాబ్స్‌లో ఈ జీనోమ్‌ సీక్వెన్స్‌ విశ్లేషణ చేయనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌కు చెందిన రెండు సంస్థలను కేంద్రం ఎంపిక చేసింది. సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ సంస్థల్లో జీనోమ్‌ సీక్వెన్స్‌ విశ్లేషణ చేయనుంది.

దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో.. 5శాతం కేసులపై జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ స్టడీ చేయనుంది. కొత్త రకం వైరస్‌లు ఎక్కడెడ్కడ ఉన్నాయి, ఏయే రకాలు ఉన్నాయన్న వాటిని ఈ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ విశ్లేషణ ద్వారా తెలుసుకోనున్నారు. ఇప్పటికే యూకేలో బయటపడ్డ కొత్తరకం కరోనా వైరస్‌ కోసం పరిశోధనలు జరుగుతున్నాయి.

హైదరాబాద్‌ సీసీఎంబీలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన నివేదిక కేంద్రానికి అందింది. యూకే నుంచి తిరిగొచ్చిన 20 మందికి సంబంధించిన కరోనా పాజిటివ్‌ శాంపిళ్లను సీసీఎంబీ విశ్లేషించింది. ఈ ఫలితాలను కేంద్ర ప్రభుత్వం ఇవాళ వెల్లడించనుంది. సీసీఎంబీ సహా మొత్తం 6 రాష్ట్రాల్లో యూకే రకం మ్యుటేషన్‌ కోసం టెస్టులు చేయనున్నారు.