NTR Rs.100 Coin : ఎన్టీఆర్ ఫొటోతో రూ.100 కాయిన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ఫొటోతో రూ.100 కాయిన్ రానుంది. ఎన్టీఆర్ ఫొటోతో రూ.100 కాయిన్ కు కేంద్ర ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.100కాయిన్ పై ఎన్టీఆర్ ఫొటో ముద్రణకు కేంద్రం ఓకే చెప్పింది.

NTR Rs.100 Coin : ఎన్టీఆర్ ఫొటోతో రూ.100 కాయిన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

NTR Rs.100 coin

NTR Rs.100 Coin : దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ఫొటోతో రూ.100 కాయిన్ రానుంది. ఎన్టీఆర్ ఫొటోతో రూ.100 కాయిన్ కు కేంద్ర ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.100కాయిన్ పై ఎన్టీఆర్ ఫొటో ముద్రణకు కేంద్రం ఓకే చెప్పింది. ఈ మేరకు రూ.100 కాయిన్ తుదిరూపు దిద్దుకుంటోంది. హైదరాబాద్ లో పురందేశ్వరీని కలిసిన మెంట్ అధికారులు కాయిన్ నమూనాను చూపించి సలహాలు అడిగారు. త్వరలో ఎన్టీఆర్ ఫొటోతో రూ.100 కాయిన్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.

ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులకు తీపి కబురు అందిస్తోంది. రూ.100 వెండి నాణెం ముద్రణకు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రెండు, మూడు డిజైన్లు తయారు చేశారు. అయితే ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి దీని మొత్తానికి చొరవ తీసుకున్నారు. గతంలో పార్లమెంట్ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆమె కీలక పాత్ర పోషించారు.

PM Modi: రాజ్యసభలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించిన మోదీ

ఇప్పుడు కూడా తన తండ్రి (ఎన్టీఆర్) ఫొటోను రూ.100 వెండి నాణెంపై ముద్రించాలని కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా దగ్గుబాటి పురందేశ్వరి ప్రయత్నాలు ఫలించాయని చెప్పవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్రం నిర్ణయం పట్ల ఎన్టీఆర్ అభిమానులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే మింట్ అధికారులు పురందేశ్వరిని హైదరాబాద్ లోని ఆమె నివాసంలో కలిసి ఎన్టీఆర్ నాణెంకు సంబంధించిన నమూనాలను చూపించి అందులో ఒకటి ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా పురందేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కేంద్రప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం ప్రకటిస్తున్నారు. ఎన్టీఆర్, తెలుగు వారికి గౌరవం దక్కడం చాలా అరుదుగా ఉంటుందని, కేంద్రం నిర్ణయం తెలుగు వారిని గౌరవించినట్లుగా భావిస్తున్నారు.