Agnipath : ఇక సైన్యంలో రెగ్యులర్ సర్వీస్ ఉద్యోగాలుండవా?

పదిహేడన్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్లను అగ్నిపథ్ స్కీంలో భాగంగా నియమిస్తారు. వీరి సర్వీసు నాలుగేళ్లు. అందులో ఆరు నెలలు శిక్షణ, మూడున్నరేళ్లు సర్వీసులో కొనసాగుతారు. 90 రోజుల్లో తొలి బ్యాచ్‌ నియామకం చేపట్టనున్నారు.

Agnipath : ఇక సైన్యంలో రెగ్యులర్ సర్వీస్ ఉద్యోగాలుండవా?

Agnipath

Agnipath scheme : భారత సైనిక దళాల నియామకాల్లో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్‌ అనే కాంట్రాక్ట్ సర్వీసు విధానం అగ్గిరాజేసింది. త్రివిధ దళాల్లో చేరాలనుకునే యువత కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చామని కేంద్రం చెబుతోంది. సైనిక నియామకాలపై ఎప్పటినుంచో ఆశలు పెట్టుకున్నయువకులు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు అగ్నిపథ్ స్కీమ్‌పై యువత అభ్యంతరాలేంటి? ప్రభుత్వ వాదన ఎలా ఉంది. దేశవ్యాప్తంగా చెలరేగిన అగ్ని జ్వాలలను చల్లార్చేందుకు కేంద్రం ఏం చేయబోతోంది?  భారత సైనిక దళాలను ప్రపంచంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కొత్త సంస్కరణలు చేపడుతున్నామని కేంద్ర ప్రభుత్వం అంటోంది.

ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు నైపుణ్యం కలిగిన ఉద్యోగులు లభిస్తారని చెబుతోంది. అయితే నిరుద్యోగ యువత మాత్రం అగ్నిపథ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన బాటపట్టారు. బీహార్, ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాలతోపాటు దక్షిణాదిలో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో నిరుద్యోగ యువత నిరసన బాట పట్టారు. తెలంగాణలో ఆందోళనలు అదుపు తప్పి పలు రైళ్లకు నిప్పు పెట్టారు. రైల్వే పోలీసులు కాల్పుల్లో ఓ యువకుడు కూడా బలయ్యాడు. దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాల్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. త్రివిధ దళాల నియామక ప్రక్రియలో అగ్నిపథ్‌ పేరుతో కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికింద మూడు సర్వీసుల్లో నియామకాలను స్వల్పకాల, ఒప్పంద ప్రాతిపదికన చేపడతారు.

Pinarayai On Agnipath : అగ్నిప‌థ్‌ను నిలిపివేయాలంటూ ప్రధాని మోదీకి సీఎం లేఖ‌

పదిహేడన్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్లను అగ్నిపథ్ స్కీంలో భాగంగా నియమిస్తారు. వీరి సర్వీసు నాలుగేళ్లు. అందులో ఆరు నెలలు శిక్షణ, మూడున్నరేళ్లు సర్వీసులో కొనసాగుతారు. 90 రోజుల్లో తొలి బ్యాచ్‌ నియామకం చేపట్టనున్నారు. అందులో దాదాపు 45వేల మందికి అవకాశం కల్పించనున్నారు. అగ్నివీరులకు సర్వీసు కాలంలో నెలకు రూ.30వేల నుంచి 40వేల రూపాయల వరకు వేతనం, ఇతర సదుపాయాలు అందిస్తారు. ప్రతిభావంతులకు సేవా పతకాలు లభిస్తాయి. అగ్నిపథ్‌లో చేరిన వారు ఏదైనా కారణంతో చనిపోతే 48 లక్షల రూపాయల జీవిత బీమా కల్పిస్తారు. విధి నిర్వహణలో మరణిస్తే అదనంగా రూ.44 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు.

నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యాక ప్రతి అగ్నిపథ్‌ బ్యాచ్‌లోనూ 25 శాతం మందిని మెరుగైన ప్యాకేజీతో రెగ్యులర్‌ క్యాడర్‌లోకి తీసుకుంటారు. ఇందుకోసం అగ్నివీరులు స్వచ్ఛందంగా కేంద్ర డేటాబేస్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఇలా ఎంపికైనవారు కనిష్ఠంగా మరో 15 ఏళ్ల పాటు సర్వీసులో కొనసాగుతారు. త్రివిధ దళాల్లోని జేసీవో, ఎన్‌సీవో స్థాయి సిబ్బందికి వర్తించే సర్వీసు నిబంధనలే వీరికీ వర్తిస్తాయి. రెగ్యులర్‌ సర్వీసుకు ఎంపిక కాని వారు.. పదవీ విరమణ తరువాత ఉపాధి అవకాశాలు పొందేలా వెసులుబాట్లు కల్పిస్తారు. వ్యాపారం చేసుకోవడానికి ఆర్థిక సాయం అందిస్తారు.

Priyanka Gandhi : అగ్నిపథ్ ఆర్మీని అంతం చేస్తుంది : ప్రియాంక గాంధీ

త్రివిధ దళాల్లో వేతనాలు, పింఛన్ల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా అగ్నిపథ్‌ సర్వీసును కేంద్రం తీసుకొచ్చింది. మొత్తం మీద వార్షిక బడ్జెట్‌లో దాదాపు సగానికి పైగా వేతనాలు, పింఛన్లకే సరిపోతోంది. నాలుగేళ్ల సర్వీసు తర్వాత అగ్నిపథ్‌ నుంచి బయటకు వచ్చేవారికి ఎలాంటి పింఛను సదుపాయం ఉండదు. ఈ రూపంలో రక్షణ శాఖకు మిగిలే నిధులతో త్రివిధ దళాల ఆధునికీకరణకు వెసులుబాటు లభిస్తుంది. అంతేకాదు త్రివిధ దళాల్లో యువత భాగస్వామ్యం మరింత పెరుగుతుంది. మూడు దళాల్లో సైనికుల సరాసరి వయసు 32గా ఉంది. అగ్నిపథ్‌ వల్ల అది క్రమంగా 24-26 ఏళ్లకు తగ్గుతుంది. సైనికదళాల్లో సాంకేతిక సామర్థ్యం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది

అయితే యువత ఆలోచన కేంద్రం ఆలోచనకు భిన్నంగా ఉంది. శాశ్వతంగా సైన్యంలో చేరాలనుకునే తమ కలలను నీరుగార్చే విధంగా అగ్నిపథ్‌ ఉందని నిరుద్యోగులు వాదిస్తున్నారు. పాత నియామక వ్యవస్థ కింద 16.5-21 ఏళ్ల మధ్య సైన్యంలో భర్తీ కావడానికి అవకాశం ఉండేది. వారు కనీసం 15 ఏళ్లు సర్వీసులో కొనసాగేవారు. ఆ తర్వాత పింఛను వచ్చేది. అగ్నిపథ్‌లో ఈ వెసులుబాటు లేకపోవడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసుకొని బయటకొచ్చాక తమ భవిష్యత్‌ అయోమయంలో పడిపోతుందని ఆందోళన చెందుతున్నారు.  ఆ దశలో మళ్లీ సాధారణ నిరుద్యోగుల్లా ఇతరులతో తాము పోటీ పడాలా అని ప్రశ్నిస్తున్నారు. మాజీ సైనికాధికారుల్లో కొందరు అగ్నిపథ్‌ను స్వాగతిస్తుండగా.. మరికొందరు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు.

Agnipath : దేశాన్ని ఫాసిస్టు,నాజీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు-అగ్నిపథ్ పై మావోయిస్టుల స్పందన

ఈ పథకం వల్ల మూడు దళాల్లో పోరాట స్ఫూర్తి దెబ్బతింటుందని ఆందోళ వ్యక్తం చేస్తున్నారు మాజీ సైనికులు. సైన్యంలో కమిట్ మెంట్ తగ్గిపోతుందని అభిప్రాయపడుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంపై కాంగ్రెస్‌ సహా ఇతర విపక్షాలు నిరసన స్వరాన్ని పెంచాయి. ఆ పథకం దేశ ప్రయోజనాలకు, భద్రతకు, యువతకు ఏమాత్రం ఉపయోగపడదని హస్తం పార్టీ విమర్శలు గుప్పించింది. వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ కూడా నిరుద్యోగ యువతకు మద్ధతు పలికింది. అగ్నిపథ్ పథకంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా ఉద్రిక్త ఆందోళనల నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ అప్రమత్తమైంది. ఈ పథకంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్షించారు నేవీ చీఫ్‌ అడ్మిరల్ ఆర్‌ హరి, వాయుసేనాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరితో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఈ పథకం కింద సైన్యంలో పనిచేసిన అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు , అస్సాం రైఫిల్స్‌ నియామకాల్లో 10శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్లు హోంశాఖ ప్రకటించింది. అంతేగాక, ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయో పరిమితిలోనూ అగ్నివీరులకు సడలింపు కల్పించింది. మరి మున్ముందు కేంద్రం ఇంకా ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.