New Guidelines : వైరస్ సోకిన 30 రోజుల్లో చనిపోతే కోవిడ్ మరణమే..కేంద్రం కొత్త మార్గదర్శకాలు

కోవిడ్‌ మృతులకు జారీ చేసే డెత్‌ సర్టిఫికేట్లపై ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించారో చెప్పాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి.

New Guidelines : వైరస్ సోకిన 30 రోజుల్లో చనిపోతే కోవిడ్ మరణమే..కేంద్రం కొత్త మార్గదర్శకాలు

Corona Deaths

new guidelines on covid deaths : సుప్రీంకోర్టు వరుస చీవాట్లతో కేంద్ర ప్రభుత్వం మేల్కోంది. కోవిడ్‌ మృతులకు జారీ చేసే డెత్‌ సర్టిఫికేట్లపై ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించారో చెప్పాలంటూ కేంద్రానికి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేంద్రం ఈ విషయంలో నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది. కొత్తగా జారీ చేసిన గైడ్‌లైన్స్‌ ప్రకారం కోవిడ్ సోకిన 30 రోజుల్లో మరణించిన వారందరికి ఇక కోవిడ్‌ కారణంగానే మృతి చెందినట్టు మరణ ధృవికరణ సర్టిఫికేట్లను జారీ చేయనున్నారు.

RT PCR, యాంటిజెన్‌, మాలిక్యూలర్‌ టెస్ట్‌, రాపిడ్ యాంటిజెన్‌ టెస్ట్‌, ఆసుపత్రిలో కరోనా సోకినట్టు నిర్ధారించిన లేదా ఆసుపత్రిలో ఇన్‌ పెషెంట్‌గా చేరి 30 రోజుల తర్వాత మరణించిన వారందరిని కోవిడ్ కారణంగానే మృతి చెందినట్టు గుర్తించనున్నారు.. మరణం ఆసుపత్రిలో జరిగినా, ఇంటి వద్ద జరిగినా కానీ ఇందులో ఎలాంటి మార్పులుండవని కేంద్రం తెలిపింది.. కోవిడ్‌ సోకిన వారిలో 95 శాతం మరణాలు 25 రోజులలోపే జరుగుతాయని ICMR స్టడీలో తేలిందని గైడ్‌లైన్స్‌లో తెలిపింది కేంద్రం. ఇక అదే సమయంలో ఆత్మహత్య, యాక్సిడెంట్‌, ఇతర కారణాలతో మరణిస్తే వారిని ఈ కేటగిరిలో చేర్చలేమని తెలిపింది.

Corana Cases : దేశంలో మరోసారి పెరిగిన కరోనా కేసులు

మరోవైపు గతంలో జారీ అయిన డెత్ సర్టిఫికేట్లపై అభ్యంతరాలున్న వారి కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనుంది కేంద్రం.. అభ్యంతరాలున్న వారంతా ఈ కమిటీలో ఫిర్యాదు చేస్తే పరిష్కారం చూపిస్తామంది… అది కూడా 30 రోజుల్లోనే ఈ కమిటీ సమస్యను పరిష్కరిస్తోందని కేంద్రం తెలిపింది..

కోవిడ్ మృతులకు డెత్‌ సర్టిఫికేట్ల జారీకి సంబంధించి సుప్రీం కోర్టు జూన్‌ 30న తీర్పు వెలువరించింది.. డెత్‌ సర్టిఫికేట్ల జారీ విషయంలో ప్రస్తుతమున్న నిబంధనలను సడలించి.. మరింత సులభతరం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.. అదే సమయంలో డెత్‌ సర్టిఫికేట్లలో కోవిడ్‌ కారణంగా మృతి చెందినట్టు స్పష్టంగా రాయాలంది.. ఈ తీర్పును ఇన్నాళ్లకు కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది.. దీనికి సంబంధించి నిన్న ఉన్నత న్యాయస్థానానికి అఫిడవిట్‌ దాఖలు చేసింది.. దీనిపై రేపు సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరపనుంది.