SSG Security Withdrawal : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. కశ్మీర్‌లో నలుగురు మాజీ సీఎంలకు ఎస్‌ఎస్‌జీ భద్రత ఉపసంహరణ

భద్రతా సమీక్ష సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. ఎస్‌ఎస్‌జీ అనేది జమ్ముకశ్మీర్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక భద్రతా విభాగం.

SSG Security Withdrawal : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. కశ్మీర్‌లో నలుగురు మాజీ సీఎంలకు ఎస్‌ఎస్‌జీ భద్రత ఉపసంహరణ

Ssg

Central government’s key decision : జమ్ముకశ్మీర్‌లో పలువురు కీలక రాజకీయ నేతలకు భద్రత అంశంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్‌లో నలుగురు మాజీ ముఖ్యమంత్రులకు స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌ భద్రతను ఉపసంహరించుకుంది. ఈ జాబితాలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లాతో పాటు ఆయన తనయుడు ఒమర్‌ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ అజాద్‌ ఉన్నారు.

భద్రతా సమీక్ష సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. ఎస్‌ఎస్‌జీ అనేది జమ్ముకశ్మీర్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక భద్రతా విభాగం. గతంలో రాష్ట్రంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులకు రక్షణ కల్పించడానికి ఏర్పాటు చేశారు.

Special Buses : అదనపు చార్జీలు లేకుండా సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

తనకు ఎస్‌ఎస్‌జీ భద్రతను ఉపసంహరించడంపై మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా స్పందించారు. ఇది స్పష్టంగా రాజకీయ నిర్ణయమేనన్నారు. భద్రత ఉపసంహరణపై తమకు కనీసం సమాచారం ఇవ్వలేదన్నారు. ఇలాంటి చర్యలతో తమ వాయిస్‌ను అడ్డుకోలేరనీ.. సమయమే అత్యంత కీలకమైందన్నారు. మరోవైపు, భద్రతను ఉపసంహరించుకున్న విషయంపై తనకు కూడా సమాచారం ఇవ్వలేదని మెహబూబా ముఫ్తీ అన్నారు.

అధికారికంగా తనకు సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. వాళ్లు ఇలా ఎందుకు చేశారో చెప్పలేనన్నారు. తాజా నిర్ణయంతో ఈ నలుగురు మాజీ సీఎంల భద్రతను వర్గీకరించి వారికి ఉన్న ముప్పును అంచనా వేసి జమ్మూకశ్మీర్‌ పోలీసుల భద్రతా విభాగం ద్వారా రక్షణ కల్పించనున్నారు