Work From Home : ఆ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించింది. కంటైన్మెంట్ జోన్లలోని అధికారులు, సిబ్బందికి కూడా..

Work From Home : ఆ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. కేంద్రం కీలక నిర్ణయం

Work From Home

Work From Home : ఓవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్.. దేశంలో మరోసారి కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి సునామీలా దేశంపై విరుచుకుపడుతోంది. భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముందు ముందు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతాయని నిపుణులు హెచ్చరించారు.

కాగా, దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన దివ్యాంగులు, గర్భిణులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించింది. కంటైన్మెంట్ జోన్లలోని అధికారులు, సిబ్బందికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యం కల్పిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. కంటైన్మెంట్ జోన్ జాబితా నంచి తొలగించాకే ఆఫీసులకు రావాలని సూచించింది.

Lemon Water : మోతాదుకు మించి నిమ్మరం తీసుకుంటున్నారా?.. అయితే జాగ్రత్త!..

మరోసారి ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. నిత్యం లక్షలాది కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇటు భారత్‌లోనూ మరోసారి భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో లక్షా 59వేల 632 కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం కొనసాగుతోంది. కాగా, గతంలో కరోనా కారణంగా దాదాపుగా ఏడాదిన్నార పాటు ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ద్వారా విధులు నిర్వహించారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి క్రమేణా కార్యాలయాలు తెరుచుకున్నాయి. ఇంతలోనే ఒమిక్రాన్ వేరియంట్ విరుచుకుపడింది. కొవిడ్‌ ‘ఒమిక్రాన్‌’ ముప్పు పెరుగుతున్నందున ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని సంబంధిత సంస్థల యాజమాన్యాలు సూచిస్తున్నాయి.

Coffee Tea : కాఫీ తాగటం మంచిదా?..టీ తాగటం మంచిదా?

దేశంలో క‌రోనా కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి. నిన్న కొత్త‌గా 1,59,632 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపిది. మరో 327 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. 40వేల 863 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. డైలీ పాజిటివిటీ రేటు 10.21 శాతంగా ఉంది. దేశంలో ప్ర‌స్తుతం 5,90,611 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,44,53,603 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య‌ 4,83,790గా ఉంది. మొత్తం 151.58 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశారు.