Corona – TB Tests: కరోనా పేషెంట్లు టీబీ టెస్ట్ చేయించుకోవాలి!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గినట్లు కనిపించినా వైరస్ రూపాంతరాలు చెంది రకరకాల ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు మహమ్మారి ప్రభావాన్ని అంచనా వేస్తూ దేశాలకు పలు సూచనలు చేస్తుంది. ఈక్రమంలోనే భారత ఆరోగ్య శాఖ తాజాగా పలు కీలక సూచనలు చేసింది. కరోనా సోకిన వారంతా టీబీ పరీక్ష కూడా చేయించుకోవాలన్న కేంద్రం..

Corona – TB Tests: కరోనా పేషెంట్లు టీబీ టెస్ట్ చేయించుకోవాలి!

Tb

Corona – TB Tests: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గినట్లు కనిపించినా వైరస్ రూపాంతరాలు చెంది రకరకాల ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు మహమ్మారి ప్రభావాన్ని అంచనా వేస్తూ దేశాలకు పలు సూచనలు చేస్తుంది. ఈక్రమంలోనే భారత ఆరోగ్య శాఖ తాజాగా పలు కీలక సూచనలు చేసింది. కరోనా సోకిన వారంతా టీబీ పరీక్ష కూడా చేయించుకోవాలన్న కేంద్రం.. టీబీ రోగులు కూడా కరోనా పరీక్ష చేయించుకోవాలని తెలిపింది. దేశంలో టీబీ కేసులు పెరుగుతున్నాయనే నివేదికలపై స్పందించిన కేంద్రం ఈ సూచనలు చేసింది.

కరోనా నుండి కోలుకుంటున్న రోగుల ద్వారా క్షయవ్యాధి కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిందని వచ్చిన నివేదికలను ఖండించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. ఈ నివేదికలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆదివారం స్పష్టం చేసింది. ఈ రెండు వ్యాధులు అంటువ్యాధులు కాగా ప్రధానంగా ఊపిరితిత్తులపై దాడి చేస్తాయన్నది నిజమే కానీ ఈ రెండింటికి ముడిపెట్టడం సరికాదని ప్రభుత్వం తెలిపింది. ఈ మధ్య కాలంలో టీబీ రోగుల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతున్నట్లు మధ్యప్రదేశ్ వైద్యులు కనుగొన్నారని వచ్చిన వార్తల ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది.

ఆయా నివేదికలను శాస్త్రీయత లేదన్న కేంద్రం.. కరోనా సోకినవారు టీబీ పరీక్ష చేయించుకోవాలని.. అలాగే టీబీ రోగులంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నప్పుడు కోవిడ్ సోకిన వ్యక్తికి కూడా టీబీ సోకే ప్రమాదం లేకపోలేదన్న ఆరోగ్యశాఖ.. కోవిడ్ నుంచి కోలుకున్న వారికి టీబీ వ్యాపించే అవకాశం ఉందని.. అయితే ఇది రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు మాత్రమే జరుగుతుందని తెలిపింది. ముఖ్యంగా స్టెరాయిడ్స్ వంటి రోగనిరోధక శక్తిని తగ్గించేవి వాడినప్పుడు టీబీ సోకే అవకాశాలు ఎక్కువని తెలిపింది.