Central Govt Jobs : నిరుద్యోగులకు కేంద్రం భారీ శుభవార్త, 3వేల 479 పోస్టులు భర్తీ

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే మీకు శుభవార్త. కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. టీచర్ పోస్టులు భర్తీ చేయనుంది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారీగా టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Central Govt Jobs : నిరుద్యోగులకు కేంద్రం భారీ శుభవార్త, 3వేల 479 పోస్టులు భర్తీ

Central Govt Jobs

Central Govt Jobs : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే మీకు శుభవార్త. కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. టీచర్ పోస్టులు భర్తీ చేయనుంది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారీగా టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో ఉన్న ఏకలవ్య(గిరిజన) మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో 3వేల 479 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

మొత్తం పోస్టుల్లో తెలంగాణలో 262, ఆంధ్రప్రదేశ్‌లో 117 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 30 దరఖాస్తులకు చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://tribal.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 3,479
ప్రిన్సిపాల్- 175
వైస్ ప్రిన్సిపాల్- 116
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్- 1,244
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్- 1,944

రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు:
ఆంధ్రప్రదేశ్- 117 (ప్రిన్సిపాల్- 14, వైస్ ప్రిన్సిపాల్- 6, టీజీటీ- 97)
తెలంగాణ- 262 (ప్రిన్సిపాల్- 11, వైస్ ప్రిన్సిపాల్- 6, పీజీటీ- 77, టీజీటీ- 168)
చత్తీస్‌గఢ్- 514
గుజరాత్- 161
హిమాచల్ ప్రదేశ్- 8
ఝార్ఖండ్- 208
జమ్మూ అండ్ కాశ్మీర్- 14
మధ్య ప్రదేశ్- 1279
మహారాష్ట్ర- 216
మణిపూర్- 40
మిజోరం- 10
ఒడిశా- 144
రాజస్తాన్- 316
ఉత్తర్ ప్రదేశ్- 79
ఉత్తరాఖండ్- 9
సిక్కిం- 44
త్రిపుర- 58

విద్యార్హతలు: ప్రిన్సిపాల్ పోస్టులకు ఏదైనా స్కూలింగ్ సబ్జెక్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పాసై ఉండాలి. లేదా టీచింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి. 10 ఏళ్లు ఇంగ్లీష్ మీడియం హయ్యర్ సెకండరీ స్కూల్ టీచర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. టీజీటీ, పీజీటీ పోస్టుకు మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ పాస్ కావాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.

దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 1, 2021

దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2021

పరీక్ష తేదీ: జూన్ మొదటి వారం

వెబ్‌సైట్‌: https://tribal.nic.in/

నోటిఫికేషన్‌: