India Corona Cases : రోజువారీ కరోనా కేసుల వివరాలు వెల్లడించిన ఆరోగ్యశాఖ

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 8,895 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

India Corona Cases : రోజువారీ కరోనా కేసుల వివరాలు వెల్లడించిన ఆరోగ్యశాఖ

Corona

India Corona Cases : దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 8,895 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 99,155కి చేరింది. ఇక ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,46,33,255 చేరింది. ఇక కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,73,326గా నమోదైంది.

చదవండి : Hyderabad Corona : హైదరాబాద్‌లో కరోనా కలకలం.. ఒకే అపార్ట్‌మెంట్‌లో 10మందికి పాజిటివ్.. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి

దేశంలో కరోనా రికవరీ రేటు 98.35 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి కోలుకున్న 6918 మంది ఇళ్లకు వెళ్లారు. దేశంలో మార్చి 2020 తరువాత రికవరీ కేసుల శాతం భారీగా పెరిగింది. ఇక వ్యాక్సినేషన్ విషయానికి వస్తే.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుంది. 324 రోజులుగా దేశంలో వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఇప్పటివరకు 127.61 కోట్ల డోసులను అందించారు.

చదవండి : Corona Cases : దేశంలో కొత్తగా 8,603 కరోనా కేసులు..415 మరణాలు