AP Reorganisation Act: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలుపై రేపు కేంద్ర హోం శాఖ సమావేశం..

ఏపీ విభజన చట్టం అమలుపై రేపు కేంద్ర హోంశాఖ సమావేశం కానుంది. రేపు ఉదయం 11గంటలకు జరిగే ఈ సమావేశంకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పాల్గోనున్నారు.

AP Reorganisation Act: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలుపై రేపు కేంద్ర హోం శాఖ సమావేశం..

AP Reorganisation Act

AP Reorganisation Act: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాల అమలు పురోగతిని ఎప్పటికప్పుడూ కేంద్ర హోంశాఖ సమీక్షిస్తోంది. విభజన చట్టంలోని అంశాల అమలుకు ఇప్పటివరకు అనేకసార్లు సమీక్షా సమావేశాలు జరిగాయి. ఏకాభిప్రాయంతో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర హోంశాఖ ప్రయత్నం చేస్తోంది. తాజాగా.. మరోసారి ఏపీ విభజన చట్టం అమలుపై రేపు కేంద్ర హోంశాఖ సమావేశం కానుంది. రేపు ఉదయం 11గంటలకు జరిగే ఈ సమావేశంకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పాల్గోనున్నారు.

ఈ సమావేశం ఎజెండాలో మొత్తం 14 అంశాలు ఉన్నారు. ఏడు అంశాలు రెండు రాష్ట్రాలకు సంబంధించినవి కాగా, మరో ఏడు ఏపీకి సంబంధించిన అంశాలు. ఎజెండాలో ఇరు రాష్ట్రాలకు చెందిన ఏడు అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రభుత్వ కంపెనీలు కార్పొరేషన్‌ల విభజన, షెడ్యూల్ 10‌లోని సంస్థల విభజన, చట్టంలో లేని ఇతర సంస్థల విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, సింగరేణి కాలరీస్ ఏపీ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ విభజన, బ్యాంకుల్లో ఉన్న నగదు, బ్యాలెన్స్ విభజన, ఏపీ ఎస్సీ ఎస్సీఎల్, టీఎస్సి ఎస్ఎల్ క్యాష్ క్రెడిట్, 2014- 15 రైస్ సబ్సిడీ విడుదల వంటి అంశాలపై చర్చ జరగనుంది.

అదేవిధంగా ఏపీ నూతన రాజధాని ఏర్పాటుకు కేంద్ర సహకారం, ఏపీ విభజన చట్టం కింద పన్ను రాయితీలు, ఏపీలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్లు, పన్ను మదింపులో పొరపాట్ల సవరణ, నూతన విద్యాసంస్థల ఏర్పాటు, నూతన రాజధానిలో రాపిడ్ రైల్వే కనెక్టివిటీ ఏర్పాటు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.