CBI-ED: కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా న్యాయపోరాటానికి 8 విపక్ష పార్టీల నిర్ణయం

కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటోందని చాలా కాలంగా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు న్యాయపోరాటానికి సిద్ధమయ్యాయి.

CBI-ED: కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా న్యాయపోరాటానికి 8 విపక్ష పార్టీల నిర్ణయం

CBI-ED

CBI-ED: కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయాలని బీఆర్ఎస్, టీఎంసీ సహా దేశంలోని ఎనిమిది ముఖ్యమైన విపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. సీబీఐ, ఈడీ ఇతర కేంద్ర సంస్థలపై న్యాయపోరాటం చేయనున్నాయి. సుప్రీంకోర్టు లేదా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న తమపై కేంద్ర దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అనుగుణంగా నడుచుకుంటూ దాడులు చేస్తున్నాయని అన్నాయి.

ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న ఆదానీ వ్యవహారంపై దర్యాప్తు జరపకపోవటాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేయనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే అంతర్గతంగా చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చాయి ఎనిమిది పార్టీలు. న్యాయస్థానాలను ఆశ్రయించే విషయంపై సీఎంలు కేసీఆర్, మమతా బెనర్జీ సహా 8 పార్టీల నేతలు ఇప్పటికే ఓ అంగీకారానికి వచ్చినట్లు ఆయా పార్టీల వర్గాలు చెప్పాయి.

త్వరలోనే ఢిల్లీ హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు ఇప్పటికే ప్రధాని మోదీకి కేసీఆర్ సహా ఎనిమిది పార్టీల ముఖ్య నేతలు లేఖ రాశారు. కాగా, దేశంలోని ప్రతిపక్ష పార్టీలను కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ ద్వారా వేధిస్తోందని చాలా కాలంగా విపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి.

Controversial Posters : ఢిల్లీలో ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలతో పోస్టర్ల కలకలం