Central Vista : సెంట్రల్ విస్తా పనులు 60శాతమే పూర్తి..డిసెంబర్ డెడ్ లైన్ మిస్

సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు తలపెట్టిన సుందరీకరణ పనులు ఇప్పటివరకూ 60 శాతం మాత్రమే పూర్తయినట్లు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల

Central Vista : సెంట్రల్ విస్తా పనులు 60శాతమే పూర్తి..డిసెంబర్ డెడ్ లైన్ మిస్

Central Vista

Central Vista : సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు తలపెట్టిన సుందరీకరణ పనులు ఇప్పటివరకూ 60 శాతం మాత్రమే పూర్తయినట్లు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి గురువారం లోక్ సభకు తెలిపారు. అయితే ఈ పనులను డిసెంబరు నాటికి పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. 2022 గణతంత్ర వేడుకలు సెంట్రల్‌ విస్టా మార్గంలోనే జరపాలని నిర్ణయించింది. అయితే గడువు సమీపిస్తున్నా పనులు మాత్రం పూర్తి కాలేదని కేంద్రమే పార్లమెంట్ కు తెలిపింది.

సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంటు భవనం, కేంద్ర సచివాలయం, రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియా గేటు వరకు 3 కిలోమీటర్ల మార్గం సుందరీకరణ, ప్రధాని నూతన నివాసం, కార్యాలయంతోపాటు ఉప రాష్ట్రపతి నూతన నివాసం పనులు చేపడుతున్నారు.

ఇక, వచ్చే ఏడాది అక్టోబరు వరకు గడువు నిర్దేశించిన నూతన పార్లమెంటు భవనం పనులు ఇప్పటివరకు 35శాతం మాత్రమే పూర్తయినట్లు కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్​ తివారీ అడిగిన ప్రశ్నకు గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌషల్‌ కిషోర్‌ ఈ మేరకు వివరణ ఇచ్చారు. ఈ పనుల కోసం ఈ ఏడాది రూ.1,289 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

ALSO READ Mamata-Adani : అదానీతో మమత భేటీ