వ్యాక్సిన్ ఉత్పత్తి వేగవంతం..కోవాగ్జిన్ ఫార్ములాని ఇతర కంపెనీలకు ఇస్తామన్న కేంద్రం

దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

వ్యాక్సిన్ ఉత్పత్తి వేగవంతం..కోవాగ్జిన్ ఫార్ములాని ఇతర కంపెనీలకు ఇస్తామన్న కేంద్రం

Centre Agrees To Share Covaxin Formula With Other Companies

Covaxin కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. మే 1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించాలని భావించినప్పటికి టీకాల కొరత వల్ల పలు రాష్ట్రాల్లో అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా కట్టడి కోసం హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన “కోవాగ్జిన్” ఫార్మూలాను మరికొన్ని కంపెనీలకు ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ప్రకటించింది. ఇతర సంస్థల్లో కోవాగ్జిన్ ఉత్పత్తిపై భారత్ బయోటెక్ తో చర్చించామని.. దీనికి భారత్ బయోటెక్ ఆమోదం తెలిపిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఏదైనా వ్యాక్సిన్ కంపెనీలు తయారీకి ముందుకొస్తే ఫార్ములాని షేర్ చేస్తామని తెలిపింది.

ఇక, కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధిని స్తుతమున్న 6-8 వారాల వ్యవధిని 12-16 వారాలకు పెంచాలని ఇమ్యునైజేషన్ సాంకేతిక సలహా బృందం సిఫారసుకి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక,ఎఫ్ డీఐ,డబ్యూహెచ్ వో అనుమతి పొందిన ఏ వ్యాక్సిన్ అయినా దిగుమతి చేసుకోవచ్చునని తెలిపింది. విదేశీ టీకాల దిగుమతికి 1-2 రోజుల్లో అనుమతులు మంజూరు చేయనున్నట్లు తెలిపింది. టీకాల దిగుమతికి సంబంధించి ఎలాంటి దరఖాస్తులు పెండింగ్ లో లేవని తెలిపింది. ఫైజర్,మోడెర్నా సంస్థలు విదేశాంగశాఖను సంప్రదించాయని తెలిపింది. భారత్ లో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ సిద్దంగా ఉన్నట్లు తెలిపింది. ఆగస్టు-డిసెంబర్ నాటికి భారత్ లో అందుబాటులోకి 126కోట్ల డోసుల వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

కాగా, ప్రస్తుతం దేశంలో రెండు కంపెనీలే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నాయని,,రెండు కంపెనీలతో దేశమంతా వ్యాక్సిన్ ఇవ్వడం అసంభవమని ఇటీవల కేజ్రీవాల్ చెప్పిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌ ఫార్ములాను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని… వ్యాక్సిన్ తయారుచేసే ఇతర కంపెనీలకు ఫార్ములాను అందజేయాలని కేజ్రీవాల్ కొద్ది రోజుల క్రితమే కేంద్రాన్ని కోరారు.