Jal Jeevan Mission: యూపీకి భారీగా కేంద్రం నిధులు.. ఏ రాష్ట్రానికీ ఇవ్వనంతగా!

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉండగా.. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించింది. ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రానికి కేటాయించని విధంగా నిధులు ఇచ్చింది కేంద్రం.

Jal Jeevan Mission: యూపీకి భారీగా కేంద్రం నిధులు.. ఏ రాష్ట్రానికీ ఇవ్వనంతగా!

Jal Jeevan Mission

Uttar Pradesh: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉండగా.. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించింది. ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రానికి కేటాయించని విధంగా నిధులు ఇచ్చింది కేంద్రం. కేంద్ర జలశక్తి మిషన్‌ పథకం కింద పది వేల ఎనిమిది వందల 70 కోట్ల రూపాయలు మంజూరు చేసింది కేంద్రం. కేవలం 2021-22కు గాను ఈ నిధులు ఇవ్వడం గమనార్హం.

కొన్ని రోజులుగా జల్‌ జీవన్ మిషన్‌ కింద ఉత్తరప్రదేశ్‌కు భారీగా నిధులు కేటాయిస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. 2019-20లో ఒక వెయ్యి 206 కోట్లు, 2020-21లో 2 వేల 5 వందల 71 కోట్లు మంజూరు చేసింది. లేటెస్ట్‌గా నాలుగు రేట్లు ఎక్కువగా కేటాయింపులు చేసింది. ఇంత భారీ మొత్తం కేటాయించడానికి 2022లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలే కారణం అంటున్నారు విశ్లేషకులు.

మిగతా రాష్ట్రాలకు కేటాయించిన వాటిలో పశ్చిమ బెంగాల్‌కు ఆరు వేల 9 వందల 98 కోట్లు, మధ్యప్రదేశ్‌లో 3 వేల 4 వందల 10 కోట్లు మంజూరు చేసింది. మహారాష్ట్రకు 7 వేల 64 కోట్ల రూపాయలు. జల్ జీవన్ మిషన్‌ కింద కేటాయించే నిధులు రాష్ట్రంలో మంచినీటి సరఫరా కోసం వినియోగించాల్సి ఉంటుంది.

గ్రామీణ ప్రాంతాల్లో మంచి నీరు అందించడం ఈ పథకం లక్ష్యం. 2024 వరకు అన్ని గ్రామాల్లో ఇంటింటికి కుళాయి నీరు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఉత్తరప్రదేశ్‌కు భారీ కేటాయింపులపై సర్వత్ర చర్చ జరుగుతోంది.