రాఫెల్ డీల్ పై విచారణ…మరింత సమయం కావాలన్న కేంద్రం

రాఫెల్ డీల్ పై విచారణ…మరింత సమయం కావాలన్న కేంద్రం

 రాఫెల్ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్లపై మంగళవారం(ఏప్రిల్-30,2019) జరగబోయే విచారణనను వాయిదా వేయాలని సోమవారం(ఏప్రిల్-29,2019) కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది.కొత్త అఫడవిట్ ఫైల్ చేసేందుకు మరింత సమయం కావాలని,అందువల్ల విచారణ వాయిదా వేయాలని కేంద్రం సుప్రీంని కోరింది.చీఫ్ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు కేంద్రం ఈ విషయాన్ని ప్రస్తావించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున సోలిసిటర్‌ జనరల్‌ కోర్టు ఎదుట హాజరయ్యారు. విచారణ వాయిదా వేయాలంటూ కేంద్రం విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.అయితే వాయిదా కొరకు రివ్య్యూ పిటిషన్లు దాఖలు చేసిన వివిధ పార్టీల్లో ఉన్న పిటిషనర్లకు లేఖను అందజేయడానికి మాత్రం కేంద్రం తరపు న్యాయవాదికి సుప్రీం అనుమతిచ్చింది.

రాఫెల్ డీల్ లో అవతవకలేమీ జరగలేదని గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించడంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన కొన్ని కీలక పత్రాలు బహిర్గతమయ్యాయి. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక వీటిని ప్రచురించింది. వాటి ఆధారంగా పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు.ఈ పత్రాల ప్రాతిపదికన సమీక్ష జరపాలని కోరారు. అయితే  రక్షణశాఖ నుంచి ఆ పత్రాలను దొంగిలించి వాటి నకలును కోర్టుకు ఇచ్చారని, అక్రమ మార్గంలో తీసుకొచ్చిన పత్రాల ఆధారంగా తీర్పును సమీక్షించడం సరికాదని కేంద్రం వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేంద్రం అభ్యంతరాలను కొట్టివేసింది.
Also Read : వైసీపీ గెలిస్తే : భూములు లాక్కుంటారని, రౌడీలు కత్తులతో తిరుగుతారని భయపెట్టారు