New Delhi: ఎండల విషయంలో అప్రమత్తంగా ఉండండి.. రాష్ట్రాలకు కేంద్రం సూచన

ఎండ వేడిమి వల్ల ప్రజలకు తలెత్తే అనారోగ్య సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దేశంలో అనేక చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సాధారణంగా నమోదయ్యే స్థాయి కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

New Delhi: ఎండల విషయంలో అప్రమత్తంగా ఉండండి.. రాష్ట్రాలకు కేంద్రం సూచన

New Delhi: దేశంలో ఎండాకాలం మొదలవ్వబోతుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండ వేడిమి వల్ల ప్రజలకు తలెత్తే అనారోగ్య సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.

Bhainsa: భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు అనుమతి.. షరతులు విధింపు!

ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 1 నుంచి ‘నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ (ఎన్‌పీసీసీహెచ్‌హెచ్)’ కింద ‘ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్ (ఐహెచ్ఐపీ)’ కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా వాతావరణ మార్పులు, ఎండ వేడిమి వల్ల తలెత్తే అంశాలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. ఇప్పటికే దేశంలో అనేక చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సాధారణంగా నమోదయ్యే స్థాయి కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Viral Video: ఖరీదైన కారులో వచ్చి పూల కుండీల దొంగతనం.. వైరల్ అవుతున్న వీడియో!

దీంతో ఈ ఏడాది అధికంగా ఎండలు మండే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ప్రజలకు ఎండల ద్వారా తలెత్తే అనారోగ్యం విషయంలో, వైద్య సేవలు అందించేదుకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సంబంధిత ఫార్మాట్ ప్రకారం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇందుకు అవసరమైన వైద్య సేవలు, చికిత్సలు, రోగులు, అనారోగ్య సమస్యలు వంటి వివరాల్ని పొందు పర్చి కేంద్రానికి అందించాలని ఆదేశించారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ఎండ వేడిమి వల్ల తలెత్తే అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొనేందుకు అనుగుణంగా వైద్య సిబ్బందికి అవగాహన కల్పించడం, వైద్య సదుపాయాలు మెరుగుపర్చుకోవడం వంటివి చేయాలని కేంద్రం సూచించింది.