Textiles GST : ఆ భయంతోనే జీఎస్టీ పెంచలేదు, కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు

దేశంలో నిత్యవసరాల ధరల పెరుగుదలను కంట్రోల్ చేయాలంటే మోదీకి ఎన్నికల్లో ఓటమి రుచి చూపించడం ఒక్కటే మార్గమన్నారు కాంగ్రెస్ నేతలు.

Textiles GST : ఆ భయంతోనే జీఎస్టీ పెంచలేదు, కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు

Textiles Gst

Textiles GST : వస్త్రాలపై జీఎస్టీ రేటును 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలనే నిర్ణయాన్ని కేంద్రం తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీపై కాంగ్రెస్‌ స్పందించింది. ఈ ఏడాది 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయనే భయంతోనే కేంద్రం వస్త్రాలపై జీఎస్టీని పెంచాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకుందని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. జీఎస్టీ పెంచితే టెక్స్‌టైల్‌ హబ్‌గా గుర్తింపు పొందిన గుజరాత్‌లో ఓడిపోతామనే భయం బీజేపీకి పట్టుకుందని కాంగ్రెస్‌ జాతీయ అధికారప్రతినిధి పవన్‌ ఖేరా అన్నారు. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల నేపథ్యంలో కొత్త ఏడాది సుసంపన్న సంవత్సరం కావాలని ప్రజలు కోరుకోవడం అబద్ధమే అవుతుందన్నారాయన. దేశంలో నిత్యవసరాల ధరల పెరుగుదలను కంట్రోల్ చేయాలంటే మోదీకి ఎన్నికల్లో ఓటమి రుచి చూపించడం ఒక్కటే మార్గమన్నారు కాంగ్రెస్ నేతలు.

New Smartphones in 2022: జనవరి 2022లో వస్తున్న 5 టాప్ స్మార్ట్ ఫోన్స్

ఈ ఏడాదిలో చెప్పులు, ఆన్‌లైన్‌ ఆటో బుకింగ్‌, ఏటీఎం సర్వీస్‌ ఛార్జీలు, సిమెంట్‌, స్టీల్‌ తదితర వస్తువుల ధరలు మరింత ప్రియం కానున్నాయని పవన్‌ ఖేరా చెప్పారు. బీజేపీకి ఓటు, గెలుపోటముల భాష మాత్రమే అర్థమవుతుందని, ఆ పార్టీకి ప్రజల శ్రేయస్సుతో పనిలేదని విమర్శించారు. రాజస్తాన్‌, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాతే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించడం, వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసిందని పవన్ ఖేరా గుర్తుచేశారు.

పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో వస్త్రాలపై వస్తు, సేవల పన్ను రేటును 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలనే నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని జీఎస్‌టీ మండలి నిర్ణయం తీసుకుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల తెలిపారు. పాదరక్షలపై జీఎస్‌టీ పెంపు విషయంలోనూ ఇదే విధమైన డిమాండ్లు వచ్చినప్పటికీ వాటిని అంగీకరించలేదన్నారు. జీఎస్‌టీ రేట్ల హేతుబద్ధీకరణపై సమావేశమైన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందం (జీఓఎం) వస్త్రాలపై జీఎస్‌టీ పెంపును మరోసారి పరిశీలించాలని కోరిందని వివరించారు.

WhatsApp Scam : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు మాయం

ప్రస్తుతం మ్యాన్‌మేడ్‌ ఫైబర్‌పై (ఎంఎంఎఫ్‌) 18 శాతం, ఎంఎంఎఫ్‌ నూలుపై 12 శాతం, వస్త్రాలపై 5 శాతం జీఎస్‌టీ రేట్లు విధిస్తున్నారు. గత సెప్టెంబర్ 17న సమావేశమైన జీఎస్‌టీ మండలి.. పాదరక్షలు, వస్త్ర రంగాల్లో ఇన్వర్టెడ్‌ డ్యూటీ నిర్మాణాన్ని (పూర్తయిన వస్తువులపై విధించే పన్ను రేటు కంటే దాని తయారీకి ఉపయోగించే ముడి సరకులపై అధిక సుంకాలు ఉండటం) సరిదిద్దాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.