Petrol Diesel Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? వేగంగా కేంద్రం అడుగులు!

పెట్రోల్, డీజిల్‌పై పన్నులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తుంది.

Petrol Diesel Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? వేగంగా కేంద్రం అడుగులు!

Petrol

Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్‌పై పన్నులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తుంది. పెట్రోల్ ధరలు భారీగా పెరగడంపై పెట్రోలియం మంత్రిత్వశాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు చేస్తొంది. కేంద్రం పన్నును తగ్గిస్తే, రాష్ట్రాలు కూడా తగ్గించే అవకాశం ఉందని భావిస్తుంది ప్రభుత్వం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించినప్పుడే సామాన్యులు అందుకు తగ్గ ప్రయోజనాన్ని పొందుతారని విశ్వసిస్తున్నారు.

చమురు మార్కెటింగ్ కంపెనీలు(OMCలు) తదుపరి చర్యలు తీసుకునేలోపే ప్రపంచ చమురు మార్కెట్‌ను చూడటానికి విరామం ఇవ్వాలని నిర్ణయించుకుంది. వరుసగా నాలుగు రోజులు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగగా.. సోమవారం(18 అక్టోబర్ 2021) మాత్రమే ధరలు మారలేదు. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల ధరల నోటిఫికేషన్ ప్రకారం, ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరు రూ. 105.84, ముంబైలో లీటరు రూ. 111.77గా ఉంది.

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 110.09గా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హయ్యస్ట్ ధర నెల్లూరులో రూ. 113.21గా ఉంది. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు పరుగులు పెడుతుండగా.. ధరలను అదుపులోకి తీసుకుని వచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుంది. త్వరలో 5రాష్ట్రాల ఎన్నికలు రాబోతుండగా.. పెట్రోల్ ధరలు ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో కేంద్రం ఈమేరకు అడుగులు వేస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు.

గత 24 రోజుల్లో 19 రోజులు పాటు డీజిల్ ధరలు పెరిగాయి, ఢిల్లీలో డీజిల్ రిటైల్ ధర రూ .5.95 పెరిగింది. డీజిల్ ధర భారీగా పెరగడంతో, ఇంధనం ఇప్పుడు దేశంలోని అనేక ప్రాంతాల్లో లీటరు రూ .100 కంటే ఎక్కువ ధరలో లభిస్తుంది. అయితే, పెట్రోల్ ధరలు తగ్గితే, నిత్యావసర వస్తువులపై దాని ప్రభావం పడుతుందని, ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుందని కేంద్రం భావిస్తోంది.