Suspension of MPs: రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌పై కేంద్రం చర్చలు

గత వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో అనుచితంగా, హింసాత్మక ధోరణితో ప్రవర్తించిన 12 మంది ఎంపీలపై రాజ్యసభ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేసింది. ఆరుగురు కాంగ్రెస్‌ ఎంపీలు, శివసేన

Suspension of MPs: రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌పై కేంద్రం చర్చలు

Parliament

Suspension of MPs: గత వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో అనుచితంగా, హింసాత్మక ధోరణితో ప్రవర్తించిన 12 మంది ఎంపీలపై రాజ్యసభ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేసింది. ఆరుగురు కాంగ్రెస్‌ ఎంపీలు, శివసేన.. తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి చెరో ఇద్దరు, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు చొప్పున సస్పెండ్ అయ్యారు. నాలుగు పార్టీల నేతలను కేంద్రం చర్చలకు పిలిచింది.

ఉదయం 10 గంటల సమయంలో చర్చలకు రావాలని కేంద్ర పార్లమెంటరి వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పిలిచారు. అందులో శివసేన నేత కూడా ఉన్నప్పటికీ ఆహ్వానం పంపించకపోవడం గమనార్హం.

ఏ ఒక్కరినీ వదలకుండా అందరిని పిలవాలని సీపీఎం ఎంపీ ఎలమరం కరీం పార్లమెంట్ వ్యవహారాల మంత్రికి లేఖ రాశారు. ఉదయం 9గంటల 45నిమిషాలకు భావసారూప్యత కలిగిన విపక్ష నేతలతో రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సమావేశం కానున్నారు.

…………………………… : రకుల్ ఎనర్జీకి అవే కారణం అంట..

నవంబర్ 29న 12 మంది విపక్ష ఎంపీలను శీతాకాల సమావేశాల మొత్తం సస్పెండ్ చేస్తూ రాజ్య సభలో తీర్మానం ఆమోదం పొందారు. సస్పెండ్ అయిన వారిలో ఫూలోదేవి నేతం (కాంగ్రెస్‌), ఛాయా వర్మ (కాంగ్రెస్), రిపున్‌ బోరా (కాంగ్రెస్), రాజామణి పటేల్‌ (కాంగ్రెస్‌), అఖిలేశ్‌ ప్రసాద్‌ సింగ్‌ (కాంగ్రెస్‌), సయ్యద్‌ నాసిర్‌ హుస్సేన్‌ (కాంగ్రెస్‌), డోలా సేన్‌ (తృణమూల్‌), శాంతా ఛత్రీ (తృణమూల్‌), ప్రియాంకా చతుర్వేది (శివసేన), అనిల్‌ దేశాయ్‌ (శివసేన), బినోయ్‌ విశ్వం (సీపీఐ), కరీం (సీపీఎం).