Rahul Gandhi: అదానీ గ్రూప్ వెనుక ఎవరున్నారు? రాహుల్ గాంధీ

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. అదానీ వ్యవహారంపై పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీల నేతలు చర్చకు పట్టుబడుతుండగా అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంపై రాహుల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై చర్చ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. చర్చ జరపడానికి కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని చెప్పారు.

Rahul Gandhi: అదానీ గ్రూప్ వెనుక ఎవరున్నారు? రాహుల్ గాంధీ

Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. అదానీ వ్యవహారంపై పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీల నేతలు చర్చకు పట్టుబడుతుండగా అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంపై రాహుల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై చర్చ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. చర్చ జరపడానికి కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని చెప్పారు.

అదానీ వ్యవహారం అంశాన్ని తాను గత రెండేళ్లుగా లేవనెత్తుతున్నానని అన్నారు. ప్రజలకు నిజాలు తెలియాల్సి ఉందని చెప్పారు. దేశంలో లక్షలాది కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. దేశంలోని మౌలిక సదుపాయాల రంగాన్ని ఒకే ఒక వ్యక్తి హైజాక్ చేశారని అన్నారు. అదానీ గ్రూప్ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారో తెలియాలని చెప్పారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని, అందుకే చర్చ జరగకూడదని కోరుకుంటోందని అన్నారు. అదానీపై చర్చ జరగకుండా మోదీ అన్ని ప్రయత్నాలు చేస్తారని చెప్పారు.

Also Read..Adani Group : అదానీ కష్టాలు.. కొనసాగుతున్న షేర్ల పతనం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలోనూ ఎదురు గాలి

కాగా, పార్లమెంటు ఉభయ సభలు వరుసగా మూడో రోజు కూడా వాయిదాపడ్డ విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ వ్యవహారంపై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక, ఎల్ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల అంశాలపై చర్చ జరపాల్సిందేనంటూ విపక్ష పార్టీలు పట్టుబడుతుండడంతో పార్లమెంటులో గందరగోళం నెలకొంటోంది. పార్లమెంటు వాయిదాపడ్డాక, దాని వెలుపల విపక్ష పార్టీల నేతలు నిరసన తెలుపుతున్నారు.

Also Read..Stock Markets Loss : నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. అదానీ గ్రూప్ షేర్లు పతనం