Farm Laws : లోక్‌సభలో తొలి రోజే.. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశ పెట్టనున్న కేంద్రం

మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ గత శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చట్టాల రద్దుపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Farm Laws : లోక్‌సభలో తొలి రోజే.. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశ పెట్టనున్న కేంద్రం

Farm Laws

Farm Laws : మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ గత శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చట్టాల రద్దుపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల తొలి రోజు అంటే… నవంబర్‌ 29న “మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ బిల్లు”ను లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Computer Work : గంటల కొద్దీ కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌లతో గడిపేవారికి వచ్చే వ్యాధులు ఇవే

ఈ మేరకు సభా కార్యకలాపాల జాబితా సిధ్దం చేసింది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు… కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడమే కాకుండా… పార్లమెంట్‌ రద్దు బిల్లును పెట్టాలని రైతులు మొదటి నుంచి డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది.

Water : అధిక మోతాదులో నీరు తాగుతున్నారా!..అయితే జాగ్రత్త?…

రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే ప్రక్రియను కేంద్రం ప్రారంభించనుంది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ తీర్మానం చేయనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నవంబర్ 19న వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. సాగు చట్టాల రద్దుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చట్టాల రద్దు ప్రక్రియను కేంద్రం పూర్తి చేయనుంది.