Import COVID-19 Vaccines : కోవిడ్ వ్యాక్సిన్ల దిగుమతిపై బాధ్యత రాష్ట్రాలదే..

COVID-19 వ్యాక్సిన్ల దిగుమతిని రాష్ట్ర అధికారులకు, సంస్థలకు వదిలివేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ల షాట్ల కొనుగోలు నెమ్మదించే అవకాశం ఉంది.

Import COVID-19 Vaccines : కోవిడ్ వ్యాక్సిన్ల దిగుమతిపై బాధ్యత రాష్ట్రాలదే..

Centre May Put Onus On States To Import Covid 19 Vaccines

States to import COVID-19 Vaccines : COVID-19 వ్యాక్సిన్ల దిగుమతిని రాష్ట్ర అధికారులకు, సంస్థలకు వదిలివేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ల షాట్ల కొనుగోలు నెమ్మదించే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశీయ వ్యాక్సిన్ తయారీదారుల నుంచి వ్యాక్సిన్ కొనుగోళ్లకు హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ఏప్రిల్ నెలలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ మోతాదుల కోసం భారతీయ ఉత్పత్తిదారులకు ముందుగానే చెల్లించింది.

ప్రపంచంలోని COVID-19 విజృంభిస్తున్న వేళ.. మే 1 నుంచి పెద్దలందరికీ టీకాలు అందించాలని నిర్ణయించారు. కానీ, టీకాల సరఫరా తక్కువగా కనిపిస్తోంది. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ & జాన్సన్‌లను భారతదేశంలో తమ షాట్లను విక్రయించడానికి అనుమతి పొందాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. కేంద్రం కొన్ని నిబంధనలను కూడా సడలించింది. విదేశీ ఔషధ తయారీదారులతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాలకు సంస్థలకు వదిలివేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారతీయ ఉత్పత్తిదారుల సగం ఉత్పత్తిని కొనుగోలు చేస్తుందని అభిప్రాయపడుతోంది.

దేశంలో కొత్త COVID-19 కరోనా కేసులు ఐదవ రోజు రికార్డు స్థాయిలో గరిష్ట స్థాయిని తాకాయి. బ్రిటన్, జర్మనీ, అమెరికా సహా ఇతర దేశాలు ఆస్పత్రుల్లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అత్యవసర వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చాయి. ప్రభుత్వం విదేశీ వ్యాక్సిన్లను కొనుగోలు చేస్తుందని తాను అనుకోనని మరొక ప్రభుత్వ అధికారి చెప్పారు. విదేశీ వ్యవహారాలు, ఆరోగ్యం, వాణిజ్య మంత్రిత్వ శాఖలు దీనిపై ఇప్పటివరకూ స్పందించలేదు.

టీకా సేకరణపై కేంద్ర ప్రభుత్వ విధానాన్ని కోజికోడ్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో గెస్ట్ ప్రొఫెసర్ ఆరోగ్య ఆర్థికవేత్త రిజో ఎం. జాన్ విమర్శించారు. టీకాలు కొనాలి.. కేంద్రం దిగుమతి చేసుకోవాలి.. ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు వ్యాక్సిన్ల సరఫరాపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు ఫైజర్ తెలిపింది. జాన్సన్ & జాన్సన్ చిన్న స్థానిక ట్రయల్ నిర్వహించడానికి అనుమతి కోరింది. కానీ, వ్యాక్సిన్‌ను భారతదేశంలో విక్రయించడానికి ఎలాంటి ప్రణాళికలు చేయలేదు.