Cryptocurrency: తీవ్రవాదులకు నిధిగా మారుతున్న క్రిప్టోకరెన్సీ.. నియంత్రణ విధించే పనిలో ప్రభుత్వం

తీవ్రవాదులకు క్రిప్టోకరెన్సీ ఆర్థిక వనరుగా ఉపయోగపడుతుంటడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇటీవల దొరికిన అనేక తీవ్రవాద లింకుల్లో క్రిప్టోకరెన్సీ పాత్ర ఉంది. దీంతో క్రిప్టోకరెన్సీపై నియంత్రణ విధించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది.

Cryptocurrency: తీవ్రవాదులకు నిధిగా మారుతున్న క్రిప్టోకరెన్సీ.. నియంత్రణ విధించే పనిలో ప్రభుత్వం

Cryptocurrency: క్రిప్టోకరెన్సీ విషయంలో మొదటినుంచి అంత సానుకూలంగా లేని భారత ప్రభుత్వం త్వరలో మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. తీవ్రవాదులకు నిధులు సమకూర్చడంలో క్రిప్టోకరెన్సీ ఎంతగానో ఉపయోగపడుతోంది.

Hardik Pandya: ధోనీ నుంచి ఎంతో నేర్చుకున్నా.. ఆయన వల్లే ఆటగాడిగా ఎదిగా: హార్ధిక్ పాండ్యా

దీంతో క్రిప్టోకరెన్సీపై నియంత్రణ విధించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. డిజిటల్ ఆస్తులు, డిజిటల్ కరెన్సీ ఆర్థిక అస్థిరతకు దారి తీస్తాయని ఆర్థిక నిపుణుల అభిప్రాయం. మరోవైపు క్రిప్టోకరెన్సీని అనేక దేశాల్లో తీవ్రవాదులు తమకు నిధులు సమకూర్చుకునేందుకు, మనీ లాండరింగ్‌కు ఉపయోగిస్తున్నారు. మన దేశంలో కూడా క్రిప్టోకరెన్సీని తీవ్రవాదులు నిధులు సమకూర్చుకునేందుకు వాడినట్లు అధికారులు గుర్తించారు. అందుకే ఈ అంశంపై భారత్ కూడా ప్రత్యేక దృష్టిపెట్టింది. రాబోయే జీ20 దేశాల సదస్సులో ఈ అంశంపై చర్చించాలని నిర్ణయించింది.

Muslims and Hindus: వెల్లివిరిసిన మత సామరస్యం.. వినాయక చవితి వేడుకల్లో ముస్లింలు

ఈ ఏడాది నవంబర్‌లో ఈ సదస్సు జరగనుంది. ప్రైవేటు క్రిప్టోకరెన్సీ ఏజెన్సీలతోపాటు, అనేక దేశాలతో ఈ అంశంపై చర్చలు జరుపుతుంది. అంతర్జాతీయ సహకారం ఉన్నప్పుడు మాత్రమే వీటిని నియంత్రించడం సాధ్యమవుతుందని గతంలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.