Baba Ramdev IMA : రాందేవ్ బాబాపై చర్యలు తీసుకోండి లేదా అల్లోపతి వైద్యవిధానాన్ని రద్దు చేయండి, ఐఎంఏ డిమాండ్

ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా చిక్కుల్లో పడ్డారు. ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాందేవ్ బాబాపై సీరియస్ అయ్యింది. అల్లోపతి వైద్యం కరోనా చికిత్సకు పనికి రాదని రాందేవ్ చెబుతున్నారని మండిపడింది. దేశం సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ స్వ ప్రయోజనాల కోసం విపరీత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికింది.

Baba Ramdev IMA : రాందేవ్ బాబాపై చర్యలు తీసుకోండి లేదా అల్లోపతి వైద్యవిధానాన్ని రద్దు చేయండి, ఐఎంఏ డిమాండ్

Baba Ramdev Ima Allopathy

Baba Ramdev IMA Allopathy : ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా చిక్కుల్లో పడ్డారు. ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాందేవ్ బాబాపై సీరియస్ అయ్యింది. అల్లోపతి వైద్యం కరోనా చికిత్సకు పనికి రాదని రాందేవ్ చెబుతున్నారని మండిపడింది. దేశం సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ స్వ ప్రయోజనాల కోసం విపరీత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికింది.

అల్లోపతి వైద్యం, డాక్టర్లను అవమానించేలా రాందేవ్ బాబా మాట్లాడారన్నారు. రాందేవ్ బాబాపై అంటువ్యాధుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. రాందేవ్ పై చర్యలు తీసుకోకపోతే అల్లోపతి వైద్య విధానాన్నయినా రద్దు చేయాలని కేంద్రానికి తేల్చి చెప్పింది. రాందేవ్ పై చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని ఐఎంఏ హెచ్చరించింది.

ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాందేవ్ బాబా మాటలు ఉన్నాయని, ఆయనపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. ప్రతి రోజూ లక్షల మంది డాక్టర్లు తమ ప్రాణాలకు తెగించి మరీ కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారందరి శ్రమను రాందేవ్ చాలా చులకనగా మాట్లాడారని, ఇది క్షమార్హం కాదని ఐఎంఏ పేర్కొంది. కరోనా కాలంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ డాక్టర్లు శ్రమిస్తుంటే ఇలాంటి ఆరోపణలు చేయడం సరైంది కాదని తెలిపింది.

అల్లోపతి(ఆధునిక ఇంగ్లీషు వైద్య విధానం)పై యోగా గురు రాందేవ్ బాబా ఇటీవల షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. కరోనా కట్టడిలో అల్లోపతి విఫలమైందని, అదో పనికిమాలిన వైద్యమని, ఆ వైద్య విధానం పని చేయకపోవడం వల్లనే ఇన్ని లక్షల ప్రాణాలు పోతున్నాయంటూ రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.