Same-Sex Marriage: స్వలింగ వివాహంపై మళ్లీ అదే మాట.. సుప్రీం ముందు ఇస్లాం మతాన్ని కూడా ప్రస్తావించిన కేంద్రం

సెప్టెంబర్ 6, 2018న ఒక చారిత్రాత్మకమైన తీర్పులో స్వలింగ సంబంధాలను నేరంగా పరిగణించే సెక్షన్ 377ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇటీవలి నెలల్లో కనీసం నాలుగు స్వలింగ జంటలు స్వలింగ వివాహాలను గుర్తించాలని కోర్టును కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఈ విషయమై చట్టబద్ధమైన అభిప్రాయాలను వెల్లడించాలని సుప్రీం కోరింది.

Same-Sex Marriage: స్వలింగ వివాహంపై మళ్లీ అదే మాట.. సుప్రీం ముందు ఇస్లాం మతాన్ని కూడా ప్రస్తావించిన కేంద్రం

Centre opposes legal recognition of same-sex marriage

Same-Sex Marriage: స్వలింగ వివాహంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వ్యతిరేతకను వ్యక్తం చేసింది. హిందూ మతమే కాకుండా, ఇస్లాం మతం కూడా ఇందుకు సముఖంగా ఉండదని, ప్రస్తుత వివాహ భావనతో ఉన్న ఏ పౌరుల ప్రయోజనాలనైనా ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుందని సోమవారం పేర్కొంది. ఈ విషయమై భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ సహా జస్టిస్‌ ఎస్‌కె కౌల్‌, రవీంద్ర భట్‌, హిమా కోహ్లీ, పిఎస్‌ నరసింహలతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారణ చేయనుంది. ఈ సందర్భంలోనే కేంద్రం తన వ్యతిరేకతను మరోసారి స్పష్టం చేసింది.

Karnataka Election 2023: కర్ణాటక ఎన్నికలవేళ బీజేపీకి షాకిచ్చిన మాజీ సీఎం జగదీశ్ షెట్టర్.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం..

వివాహమనేది ప్రత్యేకమైన, భిన్నమైన సంస్థలాంటిదని దీనికి అనుమతి ఇవ్వడాన్ని తాము అంగీకరించమని స్పష్టం చేసింది. స్వలింగ వివాహాలను గుర్తించే కోర్టు ఉత్తర్వు అంటే మొత్తం చట్టం యొక్క జ్యుడీషియల్ రీరైటింగ్ అని కేంద్ర ప్రభుత్వం వాదించింది. అయితే దీన్ని వ్యతిరేకించడం వివక్ష చూపడం కాదని సమర్ధించుకుంది. అన్ని మతాలలోనూ వివాహం విషయంలో కొన్ని సంప్రదాయాలు కొనసాగుతూ వస్తున్నాయని, వాటికి సామాజిక పరమైన చట్టపరమైన ఆమోదాలు ఉన్నాయని పేర్కొంది. భారతీయ సామాజిక వ్యవస్థలో కూడా ఇది బలంగా పాతుకు పోయిందని, ఇస్లాంలో కూడా ఇలాంటి సంప్రదాయమే కొనసాగుతోందని చెప్పింది. స్వలింగ సంపర్కాలకు అనుమతి అనేది విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన సంప్రదాయానికి వ్యతిరేకమవుతుందనే అర్థంలో కేంద్ర ప్రభుత్వం వాదించింది.

Mallikarjun kharge: ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ..

స్వలింగ వివాహాలపై వచ్చిన పిటిషన్లకు క్షేత్ర స్థాయిలో ఆమోదం లేదని కేంద్రం పేర్కొంది. అవి కేవలం పట్టణాల్లోని ఉన్నత వర్గాల అభిప్రాయమని చెప్పింది. అన్ని గ్రామీణ, పట్టణాల్లో ఉన్న ప్రజలందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని రేపు విచారణ చేయనున్న సందర్భంగా సుప్రీంను కోరింది. వ్యక్తిగత చట్టాలను దృష్టిలో ఉంచుకుంటూనే మతపరమైన, తెగల అభిప్రాయాలు, సంప్రదాయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరింది. ఈ విషయమై గత నెలలో సుప్రీం కోర్టు ముందే కేంద్ర ప్రభుత్వం తన వ్యతిరేకతను తీవ్ర స్థాయిలో వ్యక్తం చేసింది. ఐపీసీలోని సెక్షన్ 377 ప్రకారం.. నేరరహిత స్వలింగ సంపర్కుల వివాహానికి గుర్తింపు కోరే దావాకు దారితీయదని సుప్రీంకోర్టుకు మార్చి 12న సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. భిన్న లింగ స్వభావానికి పరిమితమైన వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు అనేది చరిత్రలో ఆనవాయితీగా ఉందని, దేశ అస్థిత్వానికి దాని కొనసాగింపుకు ఇది పునాదని కేంద్రం తెలిపింది.

Women Trapping Men: ఇంటికి పిలిచి ఎంజాయ్ చేసిన యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు

“భర్త, భార్య, పిల్లలుగా ఉండే భారతీయ కుటుంబం” అనే భావనకు స్వలింగ వివాహం అనుకూలంగా లేదని కేంద్రం తెలిపింది. ‘‘జీవసంబంధమైన పురుషుడిని ‘భర్త’గా, జీవసంబంధమైన స్త్రీని ‘భార్య’గా, వారి ఇద్దరి మధ్య కలయిక నుంచి జన్మించిన పిల్లలు అనేది ఈ సమాజ అస్థిత్వం. ఆ పిల్లల్ని తండ్రి, తల్లి పెంచుతారు” అని అఫిడివిట్‭లో ప్రభుత్వం పేర్కొంది. స్వలింగసంపర్కులు భారతీయ కుటుంబ భావనతో పోల్చడం సరైంది కాదని, LGBTQ+ జంటలు దాఖలు చేసిన పిటిషన్ సరైంది కాదని కేంద్రం అభిప్రాయపడింది. “వివాహం అనే భావన అనివార్యంగా వ్యతిరేక లింగానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఐక్యతను సూచిస్తుంది. ఈ నిర్వచనం సామాజికంగా, సాంస్కృతికంగా, చట్టబద్ధంగా వివాహ ఆలోచన, భావనలో పాతుకుపోయింది. దీనికి న్యాయపరమైన వివరణ ద్వారా భంగం కలిగించకూడదు” కేంద్రం చెప్పింది.

Vedaant : మరోసారి వార్తల్లో మాధవన్ తనయుడు.. మలేషియన్ ఛాంపియన్‌షిప్ లో ఏకంగా 5 గోల్డ్ మెడల్స్

సెప్టెంబర్ 6, 2018న ఒక చారిత్రాత్మకమైన తీర్పులో స్వలింగ సంబంధాలను నేరంగా పరిగణించే సెక్షన్ 377ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇటీవలి నెలల్లో కనీసం నాలుగు స్వలింగ జంటలు స్వలింగ వివాహాలను గుర్తించాలని కోర్టును కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఈ విషయమై చట్టబద్ధమైన అభిప్రాయాలను వెల్లడించాలని సుప్రీం కోరింది.