Same-Sex Marriage: స్వలింగ సంపర్క వివాహాన్ని వ్యతిరేకించిన కేంద్రం.. సుప్రీంకు అఫిడవిట్

స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్‌లను మార్చి 13న సుప్రీం కోర్టు విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జెబి పార్దీవాలాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. సెప్టెంబర్ 6, 2018న ఒక చారిత్రాత్మకమైన తీర్పులో స్వలింగ సంబంధాలను నేరంగా పరిగణించే సెక్షన్ 377ను సుప్రీంకోర్టు కొట్టివేసింది

Same-Sex Marriage: స్వలింగ సంపర్కుల వివాహాన్ని గుర్తించాలని కోరుతూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లను కేంద్రం వ్యతిరేకించింది. ఐపీసీలోని సెక్షన్ 377 ప్రకారం.. నేరరహిత స్వలింగ సంపర్కుల వివాహానికి గుర్తింపు కోరే దావాకు దారితీయదని సుప్రీంకోర్టుకు ఆదివారం సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. భిన్న లింగ స్వభావానికి పరిమితమైన వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు అనేది చరిత్రలో ఆనవాయితీగా ఉందని, దేశ అస్థిత్వానికి దాని కొనసాగింపుకు ఇది పునాదని కేంద్రం తెలిపింది.

AP CM YS Jagan: మన ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలి.. సీఎం జగన్ ట్వీట్

“భర్త, భార్య, పిల్లలుగా ఉండే భారతీయ కుటుంబం” అనే భావనకు స్వలింగ వివాహం అనుకూలంగా లేదని కేంద్రం తెలిపింది. ‘‘జీవసంబంధమైన పురుషుడిని ‘భర్త’గా, జీవసంబంధమైన స్త్రీని ‘భార్య’గా, వారి ఇద్దరి మధ్య కలయిక నుంచి జన్మించిన పిల్లలు అనేది ఈ సమాజ అస్థిత్వం. ఆ పిల్లల్ని తండ్రి, తల్లి పెంచుతారు” అని అఫిడివిట్‭లో ప్రభుత్వం పేర్కొంది. స్వలింగసంపర్కులు భారతీయ కుటుంబ భావనతో పోల్చడం సరైంది కాదని, LGBTQ+ జంటలు దాఖలు చేసిన పిటిషన్ సరైంది కాదని కేంద్రం అభిప్రాయపడింది. “వివాహం అనే భావన అనివార్యంగా వ్యతిరేక లింగానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఐక్యతను సూచిస్తుంది. ఈ నిర్వచనం సామాజికంగా, సాంస్కృతికంగా, చట్టబద్ధంగా వివాహ ఆలోచన, భావనలో పాతుకుపోయింది. దీనికి న్యాయపరమైన వివరణ ద్వారా భంగం కలిగించకూడదు” కేంద్రం చెప్పింది.

Bengaluru-Mysuru Expressway: నా సమాధి కోసం కాంగ్రెస్ కలలు కంటోంది.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ప్రధాని మోదీ

స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్‌లను మార్చి 13న సుప్రీం కోర్టు విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జెబి పార్దీవాలాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. సెప్టెంబర్ 6, 2018న ఒక చారిత్రాత్మకమైన తీర్పులో స్వలింగ సంబంధాలను నేరంగా పరిగణించే సెక్షన్ 377ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇటీవలి నెలల్లో కనీసం నాలుగు స్వలింగ జంటలు స్వలింగ వివాహాలను గుర్తించాలని కోర్టును కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఈ విషయమై చట్టబద్ధమైన అభిప్రాయాలను వెల్లడించాలని సుప్రీం కోరింది.

ట్రెండింగ్ వార్తలు