నేడు 8వ విడత చర్చలు : కేంద్రం మెట్టుదిగుతదా? రైతులు వెనక్కి తగ్గుతారా?

నేడు 8వ విడత చర్చలు : కేంద్రం మెట్టుదిగుతదా? రైతులు వెనక్కి తగ్గుతారా?

fresh talks నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నలభై రోజులుగా ఆందోళనలు చేస్తోన్న ఈ క్రమంలో రైతులతో ఇవాళ(జనవరి-8,2020) కేంద్రం 8వ విడత చర్చలు జరుపనుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో విజ్ఞాన్ భవన్ లో 8వ విడత చర్చలు జరగబోతున్నాయి. 40 రైతు సంఘాలు ఈ చర్చల్లో పాల్గొనబోతున్నాయి.

వ్యవసాయ చట్టాలు రద్దు చేసి తీరాల్సిందేనన్న డిమాండ్​తో ఇప్పటి వరకు జరగిన 7 విడతల చర్చల్లో ఎలాంటి ఫలితం రాలేదు. అయితే మూడు చట్టాల ఉపసంహరణకు రైతు సంఘాల నేతలు పట్టుబడుతున్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈరోజు జరిగే 8 వ విడత చర్చలైనా ఫలిస్తాయా చూడాలి.

అయితే.. కొత్త చట్టాల్లో కీలక సంస్కరణలకు కేంద్రం ప్రతిపాదించటంతో ఈరోజు చర్చల్లో పురోగతి లభిస్తుందని భావిస్తున్నారు. ఈరోజు జరిగే చర్చల ఫలితాలను ముందుగానే చెప్పలేమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. కాగా, కొత్త సాగు చట్టాల రద్దు మినహా రైతులు చేసే ఎలాంటి ప్రతిపాదనైనా పరిశీలించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ తెలిపారు. నేడు రైతు సంఘాలతో ఎనిమిదో విడత చర్చలు జరుగనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అకాగా చివరిసారిగా జరిగిన 7వ విడత చర్చలు విఫలమయ్యాయి. డిసెంబర్​ 30 న జరిగిన ఆరవ విడత చర్చలలో కొంత పురోగతి లభించింది. విద్యుత్తు సబ్సిడీ, వ్యవసాయ వ్యర్థాల విషయంలో రైతుల ప్రతిపాదనలకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. అంతకు ముందు జరిగిన అన్ని చర్చలూ విఫలమయ్యాయి. అయితే నేడు జరగనున్న చర్చలలోనైనా నెలరోజులకు పైగా కొనసాగుతోన్న ప్రతిష్టంభనకు ఇరు పక్షాలు తెరదించుతాయెమో చూడాలి.