Corona: దేశంలో కరోనా కేసులు తగ్గినా.. మరణాలు తగ్గలేదు.. రాష్ట్రాలకు 25కోట్ల వ్యాక్సిన్‌లు

భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా కూడా మరణాలు మాత్రం తగ్గట్లేదు. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే, ఈసారి మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నా.. మరణాల సంఖ్య మాత్రం తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నది.

Corona: దేశంలో కరోనా కేసులు తగ్గినా.. మరణాలు తగ్గలేదు.. రాష్ట్రాలకు 25కోట్ల వ్యాక్సిన్‌లు

Centre Provides More Than 25 60 Crore Vaccine Doses To States

Corona Cases Update: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా కూడా మరణాలు మాత్రం తగ్గట్లేదు. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే, ఈసారి మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నా.. మరణాల సంఖ్య మాత్రం తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నది. తాజాగా దేశంలో 91వేల 702 కొవిడ్‌ కేసులు నమోదవగా.. ఇదే సమయంలో 3,403 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన మరణాలతో మృతుల సంఖ్య మొత్తం 3,63,079కు పెరిగింది.

కరోనా మరణాల్లో భారత్‌ ప్రపంచంలో మూడోస్థానంలో కొనసాగున్నది. అమెరికా, బ్రెజిల్‌ తొలి రెండుస్థానాల్లో ఉన్నాయి. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,77,90,073 మంది కోలుకోగా.. 11,21,671 మందికి ఆస్పత్రుల్లో, హోం క్వారంటైన్‌లలో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 24,60,85,649 మంది వ్యాక్సిన్లు వేయించుకున్నారు. దేశంలో నిన్నటి వరకు మొత్తం 37,42,42,384 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.

ఇదిలా ఉంటే, మరో మూడు రోజుల్లో దేశంలో 38 లక్షల మోతాదుల వ్యాక్సిన్‌ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందివ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. దేశంలో ఇప్పుడు ఇన్ఫెక్షన్ కేసుల వేగం తగ్గుతోందని, అయితే మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉందని ఈ క్రమంలో, దేశంలో కరోనా టీకాలు వేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్రం ప్రకటించింది.

ఇప్పటివరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మొత్తం 25.60 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను ఇచ్చారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇంకా 1.17 కోట్లకు పైగా మోతాదులు మిగిలి ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో 38 లక్షలకు పైగా వ్యాక్సిన్‌లను అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు అందివ్వనున్నారు.