Mansukh Mandaviya : ఆసియాలో తొలిసారి..భారత్ లో కంటైనర్ హాస్పిటల్స్

ఆసియాలోనే తొలిసారిగా అత్యవసర సమయాల్లో వైద్యసేవలందిచడానికి కంటైనర్‌ ఆధారిత సంచార హాస్పిటల్స్ ను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయుష్మాన్‌ భారత్‌ స్కీమ్

Mansukh Mandaviya : ఆసియాలో తొలిసారి..భారత్ లో కంటైనర్ హాస్పిటల్స్

Container

Mansukh Mandaviya ఆసియాలోనే తొలిసారిగా అత్యవసర సమయాల్లో వైద్యసేవలందిచడానికి కంటైనర్‌ ఆధారిత సంచార హాస్పిటల్స్ ను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయుష్మాన్‌ భారత్‌ స్కీమ్ కింద వీటిని ఏర్పాటు చేయనున్నట్లు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ తెలిపారు.

ఢిల్లీ, చైన్నైలో వంద పడకల సామర్థ్యం గల కంటైనర్ హాస్పిటల్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. అవసరం మేరకు వాటిని రైలు, వాయు,జల మార్గాల్లో తరలించేందుకు వీలు ఉంటుందని ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.

అయితే ఈ కంటైనర్ హాస్పిటల్స్ లో రీసెర్చ్ నుంచి ఐసీయూ, వెంటిలేటర్‌ సేవలూ అందుబాటులో ఉండనున్నాయి. సుమారు 36 మీటర్ల పొడవు, 32 మీటర్ల వెడెల్పుతో ఉంటుంది. రేడియో డయాగ్నస్టిక్‌ సౌకర్యం, సాధారణ, ఐసీయూ, వెంటిలేటర్‌ బెడ్లతో పాటు ఐసోలేషన్‌ వార్డులను కూడా ఏర్పాటు చేయనున్నారు.

కంటైనర్‌లోనే డాక్టర్లు,నర్సులకు ప్రత్యేకంగా క్యాబిన్లు ఉంటాయి. రోగి వెలుపల దూరం నుంచి కూడా కనిపించే విధంగా కంటైనర్లను సిద్ధం చేస్తున్నారు. కంటైనర్‌ హాస్పిటల్ ప్రణాళికపై సాంకేతిక, వైద్య రంగాల సహాయం తీసుకుంది ప్రభుత్వం. ఐఐటీ, ఢిల్లీ ఎయిమ్స్‌ నిపుణులు కంటైనర్‌ ఆసుపత్రి నమూనాపై కలిపి పని చేశారు.

ALSO READ Rahul Gandhi :పెగాస‌స్ పై మళ్లీ పార్లమెంట్ లో చర్చ.. సుప్రీం తీర్పుతో నమ్మకమొచ్చింది