Mamata Banerjee : ట్విట్టర్ ఇష్యూ..కేంద్రంపై మమత ఫైర్

సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్ ను నియంత్రించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.

Mamata Banerjee : ట్విట్టర్ ఇష్యూ..కేంద్రంపై మమత ఫైర్

Mamata (4)

Mamata Banerjee సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్ ను నియంత్రించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ట్విట్టర్ పై కేంద్రం చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని మమతాబెనర్జీ పేర్కొన్నారు. మొదట ట్విట్టర్ ను ప్రభావితం చేయడం కోసం కేంద్రం ప్రయత్నించిందని, అది విఫలమవడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దానిని పూర్తిగా తుడిచి పెట్టడం కోసం ప్రయత్నిస్తోందని మమత ఆరోపించారు.

కేంద్రం తమ మాట వినని వారిని తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తోందని, తన ప్రభుత్వాన్ని కూడా అణచి వేయడానికి ప్రయత్నిస్తున్నారని మమతా బెనర్జీ అన్నారు. అయితే తనను కానీ, తన ప్రభుత్వాన్ని కానీ తుడిచి పెట్టడం వారి వల్ల కాదని మమత తెలిపారు. కేంద్రం చర్యలు దురదృష్టకరమని,ఏదో ఒక రోజు దీనికి ముగింపు ఉంటుందని మమత అన్నారు.

ఇక,బెంగాల్ లో రాజకీయ హింస కొనసాగుతున్నట్లు బీజేపీ చేస్తోన్న ఆరోపణలను మమత ఖండించారు. ఇవి బీజేపీ జిమ్మిక్స్ అని,బీజేపీ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవన్నారు. రాష్ట్రంలో రాజకీయ హింసలు జరగడం లేదన్నారు. ఒకటి లేదా రెండు అప్పుడప్పుడు సంఘటనలు జరిగి ఉండవచ్చు, కాని వాటిని రాజకీయ హింస సంఘటనలుగా ముద్రించలేమని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఇక బెంగాల్ లో రాజకీయ హింస ను ప్రేరేపిస్తుంది బీజేపీ నాయకులే అంటూ మమత తెలిపారు.