Covid-19 Fake Vaccines : నకిలీ వ్యాక్సిన్‌లపై రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక.. ఎలా గుర్తించాలో వివరణ

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవటంతో నకిలీ టీకాల సరఫరా పై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.

Covid-19 Fake Vaccines : నకిలీ వ్యాక్సిన్‌లపై రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక.. ఎలా గుర్తించాలో వివరణ

Covid 19 Fake Vaccines

Covid-19 Fake Vaccines : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవటంతో నకిలీ టీకాల సరఫరా పై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఒరిజినల్‌ను మించి నకిలీది తయారీ చేయటంలో కొందరు సిధ్దహస్తులు. అందుకని నకిలీ టీకాలను ఎలా గుర్తించాలో అన్నది కేంద్రం రాష్ట్రాలకు వివరించింది. భారతదేశంలో తయారైన కోవీషీల్డ్ వ్యాక్సిన్ నకిలీ వెర్షన్ల గురించి అంతర్జాతీయ మార్కెట్ లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో నకిలీ కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లను సీజ్‌ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు అప్రమత్తం చేసింది. భారత్‌లో కూడా నకిలీ కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లు అమ్ముతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం నకిలీ వ్యాక్సిన్ లపై దర్యాప్తును ప్రారంభించింది.

ఈ నేపధ్యంలో దేశంలో వినియోగిస్తున్నకోవిడ్ వ్యాక్సిన్‌ల ప్రామాణికతను గుర్తించేందుకు అనుసరించాల్సిన విధానాల జాబితాను కేంద్రం రాష్ట్రాలకు శనివారం జారీ చేసింది. వ్యాక్సిన్ నకిలీదా లేదా అసలైనదా అని గుర్తించడానికి అవసరమైన ప్రామాణికాల పట్టికను రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ప్రస్తుతం భారతదేశంలో ఉపయోగిస్తున్న మూడు టీకాలు-కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ వీ తయారీ కంపెనీల సమాచారంతో వ్యాక్సిన్ నకిలీదా, లేదా అసలైనదా అని గుర్తించేందుకు సహాయపడే ప్రామాణికాల పట్టికను తయారు చేసినట్లు తెలిపింది. టీకా తయారీదారులు ఉపయోగించే లేబుల్, రంగు, ఇతర వివరాలను కూడా రాష్ట్రాలకు పంపిన నోట్‌లో కేంద్రం వెల్లడించింది.