Healthcare Workers Insurance: కొవిడ్ హెల్త్‌కేర్ వర్కర్ల రూ.50లక్షల ఇన్సూరెన్స్ ఇక లేనట్లే..

కరోనా విధుల్లో పాల్గొంటూ ఎవరైనా హెల్త్ కేర్ వర్కర్ చనిపోతే... వారి కుటుంబ సభ్యులకు కేంద్రం రూ.50 లక్షల ఇన్సూరెన్స్..

Healthcare Workers Insurance: కొవిడ్ హెల్త్‌కేర్ వర్కర్ల రూ.50లక్షల ఇన్సూరెన్స్ ఇక లేనట్లే..

Healthcare Workers Insurance

Healthcare Workers Insurance: కరోనా వైరస్ ఇండియాలోకి ఎంటర్ అయిన తొలినాళ్లలో హెల్త్‌కేర్ వర్కర్లలో స్థైర్యం నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ స్కీమ్ తెచ్చింది. దీని ప్రకారం… కరోనా విధుల్లో పాల్గొంటూ ఎవరైనా హెల్త్ కేర్ వర్కర్ చనిపోతే… వారి కుటుంబ సభ్యులకు కేంద్రం రూ.50 లక్షల ఇన్సూరెన్స్ పరిహారం ఇస్తామని తెలిపింది.

ఆ స్కీమ్ ఉంది అనే ఉద్దేశంతో తమ తదనంతరం కుటుంబానికి ఎంతోకొంత ఆర్థిక సహాయం అందుతుందనే నమ్మకంతో ప్రాణాలను పణంగా పెట్టి చాలా మంది హెల్త్ కేర్ వర్కర్లు కరోనా పేషెంట్లకు సేవలు చేస్తూ వస్తున్నారు. అలాంటిది కేంద్రం తాజాగా… ఈ స్కీంను ఆపేయాలని నిర్ణయించుకుంది.

అప్పటి కంటే ఇప్పుడే ఈ స్కీమ్ అవసరం కనిపిస్తుంది. ఎలా అంటే. ఇప్పుడే దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం.. మరణాలు ఎక్కువవడం సంభవిస్తున్నాయి. ఎక్కువ కేసులూ వస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రం ఈ స్కీమ్ లేపేయడం హెల్త్ కేర్ వర్కర్లకు షాకింగే అనుకోవాలి.

గత నెలలో కేంద్ర ఆరోగ్య శాఖ సైలెంటుగా ఓ సర్క్యులర్‌ని రాష్ట్రాల ప్రభుత్వాలకు పంపింది. మార్చి 24తో ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ముగిసినట్లే అని అందులో ఉంది. అప్పటికి 287 మంది హెల్త్ కేర్ వర్కరు చనిపోగా… వారికి ఈ స్కీమ్ వర్తిస్తోంది. వారి కుటుంబ సభ్యులకు కేంద్రం రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది.

అది కూడా మార్చి 24 అర్ధరాత్రి లోపు చనిపోయిన హెల్తే కేర్ వర్కర్లకే వర్తిస్తుందని రాజేశ్ భూషణ్ వెల్లడించారు. ఈ స్కీమ్… కేంద్రం ప్రకటించిన రూ.1.7 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగం అని కేంద్రం గతేడాది గొప్పగా చెప్పుకుంది. దేశంలోని సుమారు 22 లక్షల మంది హెల్త్ కేర్ వర్కర్లకు ఈ స్కీమ్ వర్తిస్తోందని అప్పట్లో తెలిపింది.

ఇక్కడ హెల్త్ కేర్ వర్కర్లు అంటే… రోడ్లు ఊడ్చేవారు, పారిశుధ్య పనులు చేసేవారు, వార్డ్ బాయ్స్, నర్సులు, ఆశా (ASHA) వర్కర్లు, పారా మెడికోలు, టెక్నీషియన్లు, డాక్టర్లు, స్పెషలిస్టులు, ఇతర హెల్త్ వర్కర్లు కూడా వస్తారు. వీళ్లందరికీ ఇన్సూరెన్స్ వర్తించినట్లే.

ఇప్పుడు ఈ స్కీమ్ ఎత్తేసినందువల్ల వీరిలో ఎవరైనా చనిపోతే… ఇన్సూరెన్స్ పరిహారం రూ.50 లక్షలు వారి కుటుంబ సభ్యులకు రావు. ఇది చాలా షాకింగ్ విషయం. ఎందుకంటే… ఇప్పుడే ఎక్కువ మంది చనిపోయే ప్రమాదం కనిపిస్తోంది… దీన్ని కొనసాగించాలి అని హెల్త్ కేర్ వర్కర్లు కోరుతున్నారు.

ఈ స్కీమ్ ప్రైవేట్ రంగంలోని వారికి కూడా వర్తించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకారం ఇండియాలో అనధికారికంగా 739 మంది MBBS డాక్టర్లు సెకండ్ వేవ్ కరోనా వల్ల చనిపోయారు. కానీ వారికి ఈ స్కీమ్ ఇప్పుడు వర్తించేలా కనిపించట్లేదు.

తాజా రిపోర్టుల ప్రకారం… మార్చి 24తో స్కీమ్ ముగిసినందువల్ల… దీని కింద ఇన్సూరెన్స్ పరిహారం కోసం అప్లై చేయాలనుకునే వారు… నెల రోజుల్లో డెత్ సర్టిఫికెట్ ఇతర పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అంటే ఏప్రిల్ 24లోపు ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చిన వారి పత్రాలను పరిశీలించి… తెలుసుకొని… స్కీమ్ వర్తింపజేయాలా, వద్దా అనేది డిసైడ్ చేయనున్నారు అధికారులు.

మొదట్లో 90 రోజులకే స్కీమ్ తెచ్చిన కేంద్రం తర్వాత దాన్ని ఏడాది పొడిగించింది. ఇప్పుడు దీన్ని తొలగించడంపై డాక్టర్లు అభ్యంతరం చెబుతున్నారు. అప్పటి కంటే ఇప్పుడు ఈ స్కీమ్ ఇంకా ఎక్కువ అవసరం ఉందనీ… వెంటనే దీన్ని మళ్లీ అమలు చెయ్యాలని వేడుకుంటున్నారు.