Health Effects of Tea: టీ తాగుతున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలుసా?

Tea Side Effects: టీని అధికంగా తాగితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి చాలా మందికి తెలియదు.. ఏమీ కాదులే అని ఛాయ్ ని బాగా తాగేస్తుంటారు.

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాయ్ అంటే తెలియని వారు ఎవరూ లేరు. టీని తాగనివారు చాలా తక్కువగా ఉంటారు. భారతీయుల జీవితాల్లో ఛాయి ఎంతగా భాగమైపోయిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఉద్యోగులు ఉల్లాసం కోసం, ఒత్తిడిని తట్టుకోవడానికి టీ తాగుతారు. పేదలు ఉదయాన్నే ఆకలిని తట్టుకుని, చాలా సమయం గడపడానికి టీని తీసుకుంటారు. టీతో పాటు చపాతి, బిస్కెట్లు వంటివి తీసుకుంటారు.

ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఛాయి తాగనిదే చాలా మందికి ఏదీ తోచదు. మసాలా టీ, అల్లం టీ, బాదం టీ, ఇరానీ ఛాయ్ ఇలా ఎన్నో రకాల తేనీరు లభిస్తుంది. అయితే, కొందరు ఐదేసి కప్పులకు మించి కూడా దాన్ని తాగుతుంటారు. చలి కాలంలో ఈ ధోరణి అధికంగా ఉంటుంది. టీని మితంగా తీసుకుంటేనే మనకు లాభం.

టీని అధికంగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు, సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. టీలో సాధారణంగా కెఫిన్ ఉంటుంది. టీని ఎక్కువగా తీసుకునే వారు ఆందోళన, ఆత్రుతతో బాధపడతారు. శరీరంలో కెఫిన్ అధికంగా చేరితే మూత్ర విసర్జనకు సంబంధించిన సమస్యలూ ఎదురవుతాయి. అలాగే, నిద్రలేమి సమస్యలతోనూ బాధపడాల్సి ఉంటుంది. టీలోని థియోఫిలిన్ అనే పదార్థం మన జీర్ణ వ్యవస్థకు నష్టం చేకూర్చుతుంది.

శీతాకాలంలో ఎముకలు, కీళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి

టీని అధికంగా తీసుకుంటే మలబద్ధక సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. హృదయనాళ వ్యవస్థకు కెఫిన్ నష్టాన్ని చేకూర్చుతుంది. హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు, చికిత్స తీసుకుని కోటుకుంటున్నవారు టీకి దూరంగా ఉండాలి. గర్భిణులు కూడా అధికంగా కెఫిన్ ఉండే టీ వంటి పానీయాలను తీసుకోవద్దు. అలాగే, మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే టీ, కాఫీల వంటివి తాగొచ్చా? తాగవద్దా? అన్న విషయాలను వైద్యులను అడిగి తెలుసుకుని, పాటించాలి. లేదంటే మీ ఆరోగ్యం మరింత పాడైపోయే ప్రమాదం ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు