ముథూట్ ఫైనాన్స్ లో చోరీ చేసిన బంగారు ఆభరణాలు, భార్యల పేరిట తనఖా..ముఠా గుట్టు రట్టు

  • Published By: madhu ,Published On : August 29, 2020 / 08:21 AM IST
ముథూట్ ఫైనాన్స్ లో చోరీ చేసిన బంగారు ఆభరణాలు, భార్యల పేరిట తనఖా..ముఠా గుట్టు రట్టు

చోరీ చేసిన బంగారు ఆభరణాలను ఫైనాన్స్ లో తనఖా పెట్టిన వారిని అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. తీగలాగితే డొంక కదిలినట్లు ఈ ముఠా చేసిన నేరాలు బయటపడ్డాయి. పార్చా ముఠా సభ్యులు తమ భార్యల పేర్లతో ముథూట్ ఫైనాన్స్ లో చోరీ చేసిన బంగారు ఆభరణాలను తనఖా పెట్టారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.



హిమాన్షు జితేందర్ (జిత్తు), బబితా, ప్రీతి, రాహుల్, నితిన్ తో పాటు ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ఐదు దోపిడీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు జరిపిన విచారణలు పలు అంశాలు వెలుగు చూశాయి.

హిమాన్షు 9వ తరగతి వరకు చదువుకున్నాడు. త్రిలోక్ పురి సుభాష్ మార్కెట్ లో కాస్మెటిక్ వస్తువులను ఇతని తల్లిదండ్రులు విక్రయిస్తూ జీవనం సాగించే వారు. కానీ హిమాన్షు గంజాయికి అలవాటు పడి, సులభంగా డబ్బులు సంపాదించాలని అనుకుని నేరాలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో..రాహుల్ పార్చా అనే ముఠాతో పరిచయం ఏర్పడింది.



ఈ ముఠాలో హిమాన్షు చేరాడు. గ్యాంగ్ లీడర్ రాహుల్ పార్చాతో పాటు..నలుగురు అనుచరులను ఆగస్టు 27వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై ఘజియాబాద్, ఇతర పీఎస్ లలో అనేక కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే..కూరగాయాలు వ్యాపారం చేసుకొనే జితేందర్ పార్చా ముఠాలో చేరాడు. త్రిలోక్ పురిలో భార్య, ఇద్దరు పిల్లలతో జితేందర్ నివాసం ఉండేవాడు.
https://10tv.in/madhya-pradesh-men-run-porn-ott-service-with-help-of-pakistan-man-software-engineer-among-6-arrested/
దొంగతనాలు అధికం అవుతుండడంతో అమర్ కాలనీలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఆగస్టు 26వ తేదీన లజ్ పత్ నగర్ IVలోని గుప్తా మార్కెట్ లో ఐటీ ఉద్యోగి మెడలో ఉన్న బంగారు ఛైన్ లాక్కొనేందుకు స్నాచింగ్ ముఠా ప్రయత్నించింది. కాపాడాలని ఉద్యోగి రాకేష్ యాదవ్ అరుపులకు అక్కడనే ఉన్న పోలీసులు స్పందించారు.



దొంగలను పట్టుకొనేందుకు ప్రయత్నించారు. ముఠా సభ్యులు వెళుతున్న బైక్ ను రాకేష్ యాదవ్ తన్నడంతో వారు కిందపడిపోయారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. వీరు పార్చా ముఠాకు చెందిన జితేందర్, హిమాన్షుగా గుర్తించారు. పోలీసులు చూపెట్టిన ధైర్య సాహసాలను ఉన్నతాధికారులు మెచ్చుకున్నారు.

ఓ సర్టిఫికేట్, రూ. 2 వేల నగదు ఇచ్చి అభినందించారు. అమర్ కాలనీ, కళ్యాణ్ పురి, ఘజియాబాద్ తదితర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.



చోరీ చేసిన బంగారు ఆభరణాలను మయూర్ విహార్ ఫేజ్ – 2 లో ఉన్న ముథూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టాలని వారి భార్యలకు సూచించారని పోలీసులు తెలిపారు. హిమాన్షు భార్య బబితా, జితేందర్ భార్య ప్రీతి పేరిట..తనఖా పెట్టారని గుర్తించారు. రెండు బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు.

చోరీ చేసిన రెండు బంగారు గొలుసులను త్రిలోక్ పురిలో నివాసం ఉండే..నితిన్, రాహుల్ కొనుక్కొన్నారు. వీరి నుంచి ఆ గొలుసులను స్వాధీనం చేసుకున్నారు.