Chandigarh Court: చండీగఢ్ కోర్టుకు బాంబు బెదిరింపు.. కోర్టు ఖాళీ చేసి తనిఖీ చేస్తున్న పోలీసులు

కోర్టు కాంప్లెక్స్ పరిధిలో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు, కోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే కోర్టుకు చేరుకుని, సిబ్బందిని బయటకు పంపేశారు. జడ్జిలు, లాయర్లు, ఇతర సిబ్బందిని బయటకు పంపించారు. కోర్టు కాంప్లెక్స్‌లోని అన్ని చోట్లా బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

Chandigarh Court: చండీగఢ్ కోర్టుకు బాంబు బెదిరింపు.. కోర్టు ఖాళీ చేసి తనిఖీ చేస్తున్న పోలీసులు

Chandigarh Court: చండీగఢ్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసు అధికారులు కోర్టు మొత్తాన్ని ఖాళీ చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం జిల్లా కోర్టు కార్యకలాపాలు జరుగుతుండగా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఉదయం పదిన్నర గంటల సమయంలో గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

Rohit-Shubman Gill: సెంచరీలతో చెలరేగిన ఓపెనర్లు.. శతక్కొట్టిన రోహిత్, గిల్

కోర్టు కాంప్లెక్స్ పరిధిలో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు, కోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే కోర్టుకు చేరుకుని, సిబ్బందిని బయటకు పంపేశారు. జడ్జిలు, లాయర్లు, ఇతర సిబ్బందిని బయటకు పంపించారు. కోర్టు కాంప్లెక్స్‌లోని అన్ని చోట్లా బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నిజంగానే బాంబ్ ఉందా.. లేదా అనే దానిపై పోలీసులు సోదాలు చేస్తున్నారు. కోర్టు పరిధిలో మొత్తం 30 గదుల వరకు ఉన్నాయి. కోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్న పోలీసులు, భారీ భద్రత మధ్య సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కోర్టు ప్రాంగణం స్థానికంగా సెక్టార్ 43 ప్రాంతంలో ఉంది.

Rahul Gandhi: సర్జికల్ స్ట్రైక్స్‌పై ఎలాంటి ఆధారాలు అక్కర్లేదు.. దిగ్విజయ్ వ్యాఖ్యలు సరికాదు: రాహుల్ గాంధీ

దగ్గర్లోనే సెక్టార్ 34 కూడా ఉంది. ఇక్కడ పెద్ద బస్ టెర్మినల్ కూడా ఉంది. ఏదైనా ప్రమాదం జరిగితే భారీ నష్టం జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ పోలీసుల పర్యవేక్షణలో దాదాపు 100 మంది పోలీసులు కలిపి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. కోర్టులో సామగ్రి భారీగా ఉండటంతో తనిఖీ చేయడం నెమ్మదిగా సాగుతోంది.