చండీగఢ్ వ్యక్తికి మెర్సిడెస్ కారు అమ్మి బురిడీ కొట్టించిన వైజాగ్ వాసి

చండీగఢ్ వ్యక్తికి మెర్సిడెస్ కారు అమ్మి బురిడీ కొట్టించిన వైజాగ్ వాసి

Mercedes SUV కారును రూ.52లక్షలకు అమ్మి బురిడీ కొట్టించారు. వైజాగ్ కు చెందిన వారు డబ్బుల కోసం చండీగఢ్ వ్యక్తికి టోకరా పెట్టారు. పుణ్యమంతుల నవ్య రాధాకృషన్ అనే వ్యక్తి కారు అమ్మాలనుకుంటున్నానని తనను కలిసినట్లు హిమ్మత్ జఖార్ ను ఆగష్టులో కలిశాడు. ఓ వెబ్‌సైట్ ద్వారా మెర్సిడెస్ జీఎల్ఎస్ 400ను అమ్మాలనుకున్నాడు.



అదే మొత్తానికి రూ.52లక్షల కారు అమ్మేశాడు. డాక్యుమెంట్ల విషయానికొస్తే ఆ కారుపై ఇంకా లోన్ క్లియర్ అవలేదు. కానీ, రాధాకృషన్ లోన్ క్లియర్ అయిపోయిందని బ్యాంక్ నుంచి ఎన్ఓసీ రావాల్సి ఉందని చెప్పాడు. ఆ తర్వాత ఓ డ్యూప్లికేట్ ఎన్ఓసీ తయారుచేయించి ఇచ్చాడు కూడా.



దీనిపై జఖార్ నిలదీసేసరికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పి మాట తప్పాడు. దీంతో పోలీస్ కంప్లైంట్ వరకూ వెళ్లారు. నిజానికి ఆ కారు రాధాకృషన్ తండ్రి పేరు మీద రిజిష్టర్ అయి ఉంది. ఆయన మరణం తర్వాత బంధువు చింతా శంకర్ రావు పేరుమీద ట్రాన్సఫర్ అయింది.
https://10tv.in/maruti-suzuki-launches-car-subscription-program-in-pune-hyderabad/
దాంతో రాధాకృషన్ మీద చీటింగ్ కేస్(సెక్షన్ 420), క్రిమినల్ చర్యలు(120-B)కింద కేసు ఫైల్ చేశారు.