Fancy Numbers : ఫ్యాన్సీ నెంబర్ల క్రేజ్-స్కూటీ వేలల్లో, నెంబరు లక్షల్లో ….!

మార్కెట్ లోకి వచ్చిన కొత్త వెహికల్ ను మొదట సొంతం చేసుకోవాలనుకునే పోటీ ఒకరిదైతే, తన వాహానానికి ఫ్యాన్సీ నెంబర్ వేయించుకోవాలనుకునే తహతహ మరి కొందరిది.

Fancy Numbers : ఫ్యాన్సీ నెంబర్ల క్రేజ్-స్కూటీ వేలల్లో, నెంబరు లక్షల్లో ….!

Fancy Number Craze

Fancy Numbers :  మార్కెట్ లోకి వచ్చిన కొత్త వెహికల్ ను మొదట సొంతం చేసుకోవాలనుకునే పోటీ ఒకరిదైతే, తన వాహానానికి ఫ్యాన్సీ నెంబర్ వేయించుకోవాలనుకునే తహతహ మరి కొందరిది. ఫ్యాన్సీనెంబర్లు కోసం  ఆర్టీవో ఆఫీసులో వేలం  పాటల్లో అత్యధిక  రేటుకు ఫ్యాన్సీ నెంబర్లు కొనుగోలు చేస్తున్న   వారిని మనం చూస్తూనే ఉన్నాము.  ఒక వ్యక్తి 71 వేలకు హోండా యాక్టివా కొనుగోలు చేసి దానికి ఫ్యాన్సీ నెంబర్ కోసం  రూ. 15.44 లక్షలు ఖర్చు చేసిన ఘటన చండీఘడ్ లో వెలుగు చూసింది.

చండీఘడ్ కు చెందిన బ్రిజ్ మోహన్ అనే వ్యక్తి అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పని చేస్తున్నాడు. రూ.71 వేలు పెట్టి హోండా యాక్టివా కొన్నాడు.   దానికి ఫ్యాన్సీ నెంబర్ కోసం ఆర్టీవో ఆఫీసులో అతను రూ.15.44 లక్షలు ఖర్చు చేశాడు. ఈ విషయమై మోహన్ మాట్లాడుతూ హోండా యాక్టీవాను ఈ ఫ్యాన్సీ నెంబర్‌ను వినియోగిస‍్తాను. త్వరలో కారు కొంటా. ఆ కారుకి కూడా సేమ్‌ ఫ్యాన్సీ నెంబర్‌ను ఉపయోగిస్తానని చెబుతున్నాడు.

చండీఘడ్ ఆర్టీఓ అధికారులు ఏప్రిల్‌ 13 నుంచి ఏప్రిల్‌ 16 వరకు ఫ్యాన్సీ నెంబర్ల వేలం నిర్వహించారు. ఈ ఫ్యాన్సీ నెంబర్‌ల వేలంలో కొత్త సిరీస్ సీహెచ్‌01- సీజే-0001 (CH01-CJ) నెంబర్‌ ఉందని అన్నారు. తాము నిర్వహించిన వేలంలో ఫ్యాన్సీ నెంబర్ల   కోసం రూ.1.5కోట్ల వరకు వాహనదారులు చెల్లించినట్లు అధికారులు వివరించారు.

కాగా బ్రిజ్ మోహనే  సీహెచ్‌01- సీజే-0001 కోసం అత్యధికంగా రూ. 15.44 లక్షలు చెల్లించినట్లు ఆర్టీఓ అధికారులు తెలిపారు.  సీహెచ్  01 సీజే 0002 ధర రూ, 5.4 లక్షలు పలకగా…. సీహెచ్ 01 సీజే 0007నెంబర్ ధర 4.4 లక్షలు పలికింది. సీహెచ్ 01 సీజే 003 నెంబర్ ను రూ. 4.2 లక్షలకు వాహనదారులు సొంతం చేసుకున్నారు. ఈ సమయంలో 378 మంది నెంబర్లను వినియోగ దారులు కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read : Yadagirigutta Temple: యాదాద్రి ప్రధాన ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం
ఇంతవరకు చండీఘడ్ ఆర్టీవో ఆఫీసులో అత్యధిక బిడ్ 2012 లో వచ్చిందని అధికారులు తెలిపారు. సెక్టార్ 44 నివాసి సీహెచ్‌ -01-ఏపీ సిరీస్ 0001 కోసం రూ.26.05 లక్షలకు నంబర్‌ను కొనుగోలు చేశారు. ఇది అతని ఎస్‌ -క్లాస్ మెర్సిడెస్ బెంజ్ కోసం కొనుగోలు చేశాడని ఆర్టీఓ అధికారులు గుర్తు చేశారు.