Arjun Bali : స్నేహితుడి తల్లికి రెమ్ ​డెసివిర్​ ఇచ్చేందుకు బైక్ పై 420కి.మీ ప్రయాణం

కరోనా విజృంభణ నేపథ్యంలో రెమ్ ​డెసివిర్​ ఇంజెక్షన్ కు అధిక ప్రాధాన్యం ఏర్పడిన విషయం తెలిసిందే.

Arjun Bali : స్నేహితుడి తల్లికి రెమ్ ​డెసివిర్​ ఇచ్చేందుకు బైక్ పై 420కి.మీ ప్రయాణం

Arjun Bali

Chandigarh-Alwar కరోనా విజృంభణ నేపథ్యంలో రెమ్ ​డెసివిర్​ ఇంజెక్షన్ కు అధిక ప్రాధాన్యం ఏర్పడిన విషయం తెలిసిందే. కరోనా రోగులకు అందించే ఔషధాల్లో రెమ్ ​డెసివిర్​ ప్రధానమైనది. అయితే కరోనా బారిన పడిన తన స్నేహితుడి తల్లికి రెమ్ డెసివర్ ఇంజెక్షన్ ను అందించేందుకు ఓ యువకుడు బైక్ పై ఏకంగా 420కి.మీ ప్రయాణించాడు.

పంజాబ్ రాష్ట్రంలోని చండీగడ్​కు చెందిన అర్జున్​ బాలీ, రాజస్తాన్ లోని అల్వార్ ​కు చెందిన సాహిల్​ సింగ్​ రాథోడ్​ స్నేహితులు. పంజాబ్​ విశ్వవిద్యాలయంలో వీరిద్దరూ విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు మూసివేయడంతో వీరిద్దరూ తమ తమ స్వస్థలాల్లో ఉంటున్నారు.

Arjun

. అయితే సాహిల్​ తల్లి ఇటీవల కరోనా బారినపడ్డారు. ఆమె ఆక్సిజన్​ స్థాయి 84కు పడిపోయి ఆరోగ్యం క్షీణిస్తున్న తరుణంలో రెమ్​డెసివిర్ ఇంజెక్షన్​ వేయాలని డాక్టర్లు సూచించారు. ఈ నేపథ్యంలో సాహిల్​ దాని​ కోసం అల్వార్​ అంతా తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో మిత్రుడు అర్జున్​కు విషయం చెప్పి రెమ్​డెసివిర్​, ఇతర ఔషధాలను ఏర్పాటు చేయమని కోరాడు.

సాహిల్​ తల్లిని కాపాడటం తన బాధ్యత అని విశ్వసించిన అర్జున్..సమాచారం అందిన తక్షణమే సాహిల్​ సూచించిన ఔషధాలు తీసుకుని ఏమాత్రం ఆలోచించకుండా బైక్​పైనే బయల్దేరాడు. అలా సుమారు 420 కిలోమీటర్లు ప్రయాణించి కేవలం 8 గంటల్లోనే అల్వార్​కు చేరుకున్నాడు.కొవిడ్​పై పోరాటంలో తన సోదరుడి తప్పక విజయం సాధిస్తుందని అర్జున్​ బాలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. తన మిత్రుడి కోసం అర్జున్​ చేసిన అసాధారణ సాయం గురించి తెలుసుకుని..అల్వారా జిల్లా బీజేపీ నేత సంజయ్​ నరుకా, కిసాన్​ మోర్చా జిల్లా అధ్యక్షుడు జితేంద్ర రాఠోడ్​ అతణ్ని ప్రశంసించారు. అర్జున్ ​కు పూలమాలలు వేసి, మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు.