Chandigarh: జిమ్‌లోకి వెళ్లాలంటే.. అండర్ వేర్ మీద స్టాంప్.. స్మెల్ పరీక్ష చేయించుకోవాల్సిందే

చండీఘర్ లేక్ క్లబ్ మెంబర్స్ అందరికీ కొత్త రూల్స్ తో కూడిన నోటీస్ ఇష్యూ చేసింది. అందులో రూల్స్ అంతే క్రేజీగా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జిమ్ కు వచ్చేవాళ్ల అండర్‌వేర్ మీద స్టాంప్ ఉండాలట. అంతేకాకుండా ముందుగానే స్మెల్ టెస్ట్ చేయించుకోవాలనే దారుణమైన రూల్స్ పెట్టారు.

Chandigarh: జిమ్‌లోకి వెళ్లాలంటే.. అండర్ వేర్ మీద స్టాంప్.. స్మెల్ పరీక్ష చేయించుకోవాల్సిందే

Gym Rules (1) (1)

Chandigarh: చండీఘర్ లేక్ క్లబ్ మెంబర్స్ అందరికీ కొత్త రూల్స్ తో కూడిన నోటీస్ ఇష్యూ చేసింది. అందులో రూల్స్ అంతే క్రేజీగా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జిమ్ కు వచ్చేవాళ్ల అండర్‌వేర్ మీద స్టాంప్ ఉండాలట. అంతేకాకుండా ముందుగానే స్మెల్ టెస్ట్ చేయించుకోవాలనే దారుణమైన రూల్స్ పెట్టారు. ఈ నోటీసను ఓ జర్నలిస్టు ట్విట్టర్ లో పోస్టు చేసి తర్వాత డిలీట్ చేసేశారు.

లేక్ క్లబ్ మేనేజ్మెంట్ ఆ తర్వాత ఇది ఎవరో ఆకతాయిల పని అని కొట్టిపారేసింది. జర్నలిస్టు ఆమె చేసిన పోస్టులో.. ‘ద లేక్ క్లబ్ ఛండీఘర్ నోటీస్ లోని ప్రతి లైనును ఇలా రాశారు. అండర్‌గార్మెంట్ కు స్టాంపింగ్ అప్రూవల్ ఉండాలి. బూతులు మాట్లాడకూడదు. షార్ట్స్ వేసుకోవాలనుకుంటే కాళ్లు షేవ్ చేసుకోండి’ అని ఉందంటూ ఆమె పోస్టులో పేర్కొన్నారు.

దాంతో పాటు జిమ్ కు వచ్చే వారు జిమ్ సూట్స్ ధరించి రావాలి. అంతేకాకుండా వారి అండర్ గార్మెంట్స్ కు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కేవలం అప్రూవ్ పొందిన అండర్ గార్మెంట్స్‌కే అనుమతినిస్తాం. అది సరిపోదన్నట్లు జిమ్ లో బూతులు, అసభ్యపదజాలం వాడటానికి వీల్లేదు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో పరిమితి మేరకే బూతులు మాట్లాడుకోవాలి’ అని నోటీసులో ఉంది.

దీనిని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు…
స్మెల్ టెస్టులో ఎలా ఫెయిల్ అవుతారు ?
స్మెల్లింగ్ మెంబర్స్ కు ఇన్‌ఛార్జిగా ఎవరుంటారు ?
షేవ్ చేసుకోవడానికి బదులు వ్యాక్స్ పెట్టుకోవచ్చా ?
అప్రూవ్‌డ్ అండర్‌గార్మెంట్ మాత్రమే వాడాలంటే.. దానిపై బ్రాండ్ ఎవరు చెక్ చేస్తారు ?
బూతులు వేరే భాషలో మాట్లాడితే ఎవరు కనుక్కోవాలి ?
అని విభిన్నమైన కామెంట్లు చేస్తుంటే.. మరి కొందరేమో.. ఇది నిజమైన నోటీస్ కాదని కామెంట్ చేస్తున్నారు.

జిమ్ కు చెందిన ట్రైనర్ మాట్లాడుతూ.. ‘మేం దీనిని ఇష్యూ చేయలేదు. ఎవరో ఆకతాయిలు ఈ పనిచేశారు. సోమవారం కూడా క్లబ్ మూసే ఉంది. దీనికి పాల్పడ్డ వారిని కనుగొనేందుకు సీసీటీవీ ఫుటేజి చెక్ చేస్తున్నామని అన్నారు.