చంద్రయాన్-2లోని కీలక ఘట్టాలు ఇవే..

చంద్రయాన్-2లోని కీలక ఘట్టాలు ఇవే..

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం విజయవంతమవుతుందనుకున్న తరుణంలో వాయిదా పడింది. అర్ధరాత్రి 1:53నిమిషాలకు చంద్రయాన్-2 సిగ్నల్స్ అందకుండా పోయాయి. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి సామాన్యులు సైతం కన్నార్పకుండా ఎదురుచూస్తున్న సమయంలో సిగ్నల్ కోల్పోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. 

చంద్రయాన్-2లోని కీలక దశలు:
June 12: ఇస్రో ఛైర్మన్ కే శివన్ చంద్రునిపైకి పంపనున్న భారత రెండో ప్రయోగం చంద్రయాన్ 2గురించి ప్రకటించారు. జులై 15 నాటికి లాంచ్ చేస్తామని తెలిపారు. 
June 29: రోవర్ పూర్తి అయ్యాక ల్యాండర్ విక్రమ్ కు అన్ని టెస్టులు చేశారు. 
June 30: ఆర్బిటర్‌కు సరిపోయే విధంగా ప్రగ్యాన్ రోవర్‌తో విక్రమ్ ల్యాండర్‌ను రూపొందించారు. 
July 4: లాంచ్ వెహికల్‌తో చంద్రయాన్-2ను అనుసంధానించి (GSLV MkIII-M1)ను పూర్తి చేశారు.
July 7: GSLV MkIII-M1 లాంచ్ ప్యాడ్ మీదకు వెళ్లింది. 
July 14: జులై 15కల్లా లాంచ్ చేయాలని కౌంట్ డౌన్ మొదలైంది. 
July 15: టెక్నికల్ లోపాల కారణంగా ప్రయోగానికి గంట ముందే తేదీని వాయిదా వేసింది. 
July 18: చంద్రయాన్-2 షెడ్యూల్‌ను  July 22, మధ్యాహ్నం 2గంటల 43 నిమిషాలకు శ్రీహరి కోటలోని SDSC సెకండ్ లాంచ్ ప్యాడ్ మీద సిద్ధం చేశారు.
July 21: జులై 22కు ప్రయోగించేందుకు GSLV MkIII-M1/Chandrayaan-2లను సిద్ధం చేశారు.
July 22: GSLV MkIII-M1 చంద్రయాన్ 2ను సక్సెస్ ఫుల్‌గా అంతరిక్షంలోకి ప్రయోగించారు.
July 24: భూ ఉపరితలంపై ఉన్న తొలి కక్ష్యను విజయవంతంగా దాటగలిగింది. 
July 26: రెండో కక్ష్యను కూడా దాటి ప్రయోగంపై నమ్మకాన్ని పెంచింది. .
July 29: భూమిపై ఉన్న మూడో కక్ష్యను కూడా అవంతరాలు లేకుండా దాటేసింది..
August 2: కీలకమైన నాలుగో కక్ష్యను కూడా దాటేయగలిగింది. 
August 4: చంద్రయాన్-2 ఫొటోలను ఇస్రో విడుదల చేసింది. 
August 6: ఐదో కక్ష్యను కూడా విజయవంతంగా దాటేసింది. ఇక చంద్రుడిని చేరుకోవడమే తరువాయి.
August 14: ల్యూనార్ ఆర్బిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలైయ్యాయి. 
August 20: ల్యూనార్ ఆర్బిట్‌లోకి చేరుకోవడంతో చంద్రుడి ఫొటోలను కూడా పంపింది.
August 22: Chandrayaan-2’s LI4 కెమెరా సహాయంతో 2వేల 650 కి.మీ దూరం నుంచి lunar surface ఫోటోలను విడుదల చేసింది. 
August 21: రెండో ల్యూనార్ ఆర్బిట్ ను కూడా దాటేసింది. 
August 26: Terrain Mapping Camera-2 (TMC-2) సహాయంతో Chandrayaan 2 రెండో సారి చంద్రునిపైన ఫొటోలను పంపింది. 
August 28& 30: మూడు, నాలుగు కక్ష్యలను సునాయాసంగా చేధించగలిగింది. 
September 1:ఐదో ల్యూనార్ ఆర్బిట్ కూడా చేధించడంతో సెప్టెంబర్ 6నాటికల్లా ల్యాండ్ అవుతుందని భావించారంతా. 
September 2: ఆర్బిటర్ నుంచి విజయవంతంగా విక్రమ్ ల్యాండర్ విడిపోయింది.
September 3: ఆర్బిట్ నుంచి బయటకు వస్తూ చంద్రునికి దగ్గరగా వచ్చింది. .
September 4: చంద్రుని వైపు జరిగే క్రమంలో దిశను మార్చుకుంది. 
September 7: చంద్రునిపైకి అడుగుపెట్టేందుకు సిద్ధమై ఇక క్షణాల్లోనే విజయం వరిస్తుందనుకున్న ఇస్రోకు షాక్. సడెన్ గా సిగ్నల్ కోల్పోయింది