Prashant Kishor : పీకే సంచలన వ్యాఖ్యలు..5సార్లు ఫోన్ మార్చినా హ్యాక్ చేస్తూనే ఉన్నారు

ఇజ్రాయెల్ కి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ పెగాసస్ స్పైవేర్‌తో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహా భారత్ లోని ప్ర‌ముఖుల ఫోన్లు హ్యాక్ చేసినట్లు వచ్చిన వార్తలపై సోమవారం ప్రశాంత్ కిషోర్ స్పందించారు.

Prashant Kishor :  పీకే సంచలన వ్యాఖ్యలు..5సార్లు ఫోన్ మార్చినా హ్యాక్ చేస్తూనే ఉన్నారు

Pk (1)

Prashant Kishor  ఇజ్రాయెల్ కి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ పెగాసస్ స్పైవేర్‌తో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహా భారత్ లోని ప్ర‌ముఖుల ఫోన్లు హ్యాక్ చేసినట్లు వచ్చిన వార్తలపై సోమవారం ప్రశాంత్ కిషోర్ స్పందించారు. తన ఫోన్ ఇంకా హ్యాకింగ్ కి గురైవుతుందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. 5 సార్లు తాను మొబైల్ ఫోన్లను మార్చినప్పటికి కూడా హ్యాకింగ్ కొనసాగుతుందని తెలిపారు.

ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్ విషయమై వార్తా సంస్థ ది వైర్ ప్రచురించిన రిపోర్ట్ లో కొద్ది రోజుల క్రితం.. జులై-14న కూడా ప్రశాంత్ కిషోర్ ఫోన్ హ్యాకింగ్ కు గురైనట్లు ఫోరెన్సిక్ ఎనాలసిస్ ప్రకారం తేలినట్లు పేర్కొంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కి చెందిన సెక్యూరిటీ ల్యాబ్ నిర్వహించిన డిజిటల్ ఫోరెన్సిక్స్ లో.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ ఫోన్ హ్యాకింగ్ కు గురైనట్లు తేలింది. అంతేకాకుండా టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ ఫోన్,మమత వ్యక్తిగత కార్యదర్శి ఫోన్ కూడా హ్యాకింగ్ కు గురైనట్లు తేలింది. ఇక,పెసగాస్ స్పైవేర్ ద్వారా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ,కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌ల‌ను కూడా టార్గెట్ చేసిన‌ట్లు వార్తలు వస్తున్నాయి.