ఐటీ చట్టంలో మార్పులు: సోషల్ మీడియాకి మూడిందా!  

  • Published By: veegamteam ,Published On : January 3, 2019 / 05:27 AM IST
ఐటీ చట్టంలో మార్పులు: సోషల్ మీడియాకి మూడిందా!  

ఢిల్లీ : సోషల్ మీడియా రూమర్స్ ఇక చెల్లవ్..
ఐటీ చట్టంలో భారీ మార్పులు
అతిక్రమిస్తే రూ.15 కోట్ల జరిమానా

ఫేస్‌బుక్..వాట్సాప్‌ వంటి సోషల్ మీడియాలో పుకార్లు పుంఖాను పుంఖాలుగా చక్కర్లు కొడుతున్నాయి. ఎవరి తోచినట్లుగా వారు నిజమేదో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో పుకార్లే ఎక్కువగా జరుగుతున్నాయి.ఈ పుకార్లు పలు అనర్ధాలకు కారణాలుగా మారుతున్నాయి. ఈ పుకార్లతో హత్యలు కూడా జరిగాయంటే వీటి ప్రభావం సమాజంలో ఎంతగా వుందో ఊహించవచ్చు. దీంతో సోషల్‌ మీడియాలో పుకార్లను కట్టడిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్టాన్ని సవరించేదుకు చర్యలు తీసుకుంటోంది.
 
సోషల్ మీడియాలో పుకార్లను నియంత్రించే ఉద్ధేశ్యంతో ఐటీ చట్టంలో భారీ మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది.  ఫేస్‌బుక్, వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడియాలకు భారత్‌లో ఖాతాదారులు చాలా ఎక్కువ. 2018 లో జరిగిన ఈ ఎక్స్పీరియన్స్ తో ఫేక్‌ న్యూస్‌పై ప్రజలకు అవగాహన కలిగించటంతో పాటు హెచ్చరికలను కూడా భారీస్థాయిలో ప్రభుత్వం ప్రకటించింది. అయినా ఇవి ఆగలేదు..ముఖ్యంగా ఎన్నికల క్రమంలో  ఐటీ మంత్రి రవి శంకర్‌ ఫేస్‌బుక్, వాట్సాప్‌ల యాజమాన్యాలను హెచ్చరించారు. అయినా అవి ఆగనేలేదు. 

సోషల్ మీడియా రూమర్స్ : 15 కోట్ల ఫైన్ 
పుకార్లు..అన్ వాటెండ్ డాటా..పోర్న్ కు లను కట్టడి చేయటంలో సక్సెస్ కాలేని వెబ్‌సైట్లు, యాప్‌లపై ప్రభుత్వం భారీగా ఫైన్ వేసేందుకు..దీనికి సంబంధించిన ఐటీ చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తూ  కేంద్ర ప్రభుత్వం ‘డేటా ప్రొటెక్షన్‌ బిల్లు’ పేరుతో ముసాయిదాను ఖరారు చేసింది. దీంతో  ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, గూగుల్‌ వంటి సోషల్‌ మీడియా, ఇంటర్నెట్‌ సంస్థల మేనేజ్ మెంట్ అఫీషియల్స్ తో ఐటీ శాఖ అధికారులు సమావేశమయి సోషల్ మీడియా మిస్ యూజ్ ను అరికట్టి, వాటి రెస్పాన్స్ బిలిటీ పెంచేందుకు కావాల్సిన విషయాలపై చర్చించారు. ‘అసత్య, అశ్లీల సమాచా రం సోషల్‌ మీడియాలోకి ఎక్కడ నుంచి వస్తోందో గుర్తించాలి, దాన్ని తొలగించాలి. లేదంటే సదరు సంస్థలపై రూ. 15 కోట్లు లేదా వాటి ప్రపంచవ్యాప్త టర్నోవర్‌లో 4శాతం ఫైన్ వేయాలని ఐటీ శాఖ అధికారులు ప్రతిపాదించారు. ఈ ఐటీ చట్టంలో ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలు అమలులోకి వస్తే సోషల్ మీడియాకు సంకెళ్లు పడిపోయినట్లే..ఎవరిపడితే వారు..వారికి ఇష్టమొచ్చినట్లు పుకార్లు ఇకపై వీలు కాదు. అతిక్రమిస్తే తప్పదు భారీ మూల్యం అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరముంది.