మోడీ పేరు వింటే మమతకు రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు

  • Published By: venkaiahnaidu ,Published On : April 7, 2019 / 12:48 PM IST
మోడీ పేరు వింటే మమతకు రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు

లెఫ్ట్,తృణముల్ కాంగ్రెస్ లేని బెంగాల్ ను త్వరలోనే వెస్ట్ బెంగాల్ ప్రజలు చూడబోతున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.మమతా విముక్త బెంగాల్ కు ప్రజలు ప్రతినబూనాలని మోడీ పిలుపునిచ్చారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-7,2019) వెస్ట్ బెంగాల్ లోని కూచ్ బెహర్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు.ఈ సందర్భంగా మమత సర్కార్ పై మోడీ నిప్పులు చెరిగారు.

మోడీ నినాదాలు,మోడీ అనే పేరు స్పీడ్ బ్రేకర్ దీదీకి నిద్రలేని రాత్రులను ఇస్తుందని ప్రధాని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశాన్ని విడగొట్టాలని కోరుకునే వ్యక్తులతో ‘దీదీ’ చేతులు కలుపుతున్నారని,దేశానికి ఇద్దరు ప్రధానులను కోరుకునే వారికి మమతా మద్దతుగా నిలుస్తున్నారని  మోడీ విమర్శించారు టీఎంసీ,లెఫ్ట్ రహిత బెంగాల్‌ను తాము తీసుకువస్తామని, బీజేపీకి ఓటవేసి దేశానికి, చౌకీదార్‌ కు బలం చూకూర్చాలని ఓటర్లను కోరారు. పశ్చిమబెంగాల్ ప్రజలను మమత అడగడుగునా వంచిస్తూనే ఉన్నారన్నారు.పేదలకు ఉచిత వైద్యం అందించే ఆయుష్మాన్ యోజన, రైతులకు ఆర్థిక సాయం వంటివి బెంగాల్‌లో అమలుకు నోచుకోవడం లేదన్నారు.బెంగాల్ ను కుదిపేసిన శారదా,నారదా,రోజ్ వ్యాలీ వంటి కుంభకోణాల సొమ్ములు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. 7వ వేతన కమిషన్ సిఫారసులను ఎందుకు అమలు చేయలేదో మమత ప్రజలకు వివరణ ఇచ్చారా అని నిలదీశారు.
 
అసాధ్యాలను సుసాధ్యం చేయడం బీజేపీకే సాధ్యమని ప్రధాని అన్నారు. పాకిస్థాన్ చర్యలకు ప్రతిచర్యలు చేయడం అసాధ్యమని గతంలో అనుకునేవారని, అది సాధ్యమని తమ ప్రభుత్వం నిరూపించిందన్నారు.ప్రస్థుతం దేశప్రజలు చౌకీదార్ పై నమ్మకం కలిగి ఉన్నారని,అసాధ్యాలను సుసాధ్యం చేశాడన్న ఫీలింగ్ ప్రజల్లో ఉందన్నారు.పేద ప్రజలంరికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని,అంతేకాకుండా డెబిట్ కార్డులు కూడా కలిగి ఉన్నారన్నారు.గతంలో ఇది అసాధ్యమనుకున్నారని,తాము ఇది సాధ్యం చేశామని మోడీ తెలిపారు. త్వరలోనే ఇండియాలో ఉచితంగా ఫోన్ కాల్స్ సౌకర్యం, ప్రపంచంలోనే అతి చౌకగా ఇంటర్నెట్ చార్జీలు అందుబాటులోకి వస్తాయన్నారు. మనుషుల అక్రమ రవాణాకి సంబంధించి కఠిన చట్టాలు తీసుకొచ్చామని మోడీ అన్నారు.వెస్ట్ బెంగాల్ ప్రజలు ఓటు వేసి బీజేపీని గెలిపిస్తే రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేస్తామని మోడీ అన్నారు.