CM Nitish Kumar: కల్తీ మద్యం తాగేవాడు చనిపోవడం ఖాయం.. బీజేపీ సభ్యులపై బీహార్ సీఎం మరోసారి ఎదురుదాడి

బీహార్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నువ్వానేనా అన్నట్లు మాటల యుద్ధం సాగింది. నితీష్ కుమార్ రాజీనామా చేయాలంటూ సభలో ప్రతిపక్ష సభ్యులు నినదించారు. దీంతో మరోసారి ఆగ్రహంతో ఊగిపోయిన నితీష్.. ప్రతిపక్ష సభ్యులపై మాటల దాడికి దిగారు. కల్తీ మద్యం తాగిన వ్యక్తి చనిపోవడం ఖాయం. ప్రజలే అప్రమత్తంగా ఉండాలి అంటూ నితీష్ అన్నారు.

CM Nitish Kumar: కల్తీ మద్యం తాగేవాడు చనిపోవడం ఖాయం.. బీజేపీ సభ్యులపై బీహార్ సీఎం మరోసారి ఎదురుదాడి

cm nitish kumar

CM Nitish Kumar: బీహార్ రాష్ట్రం సరన్‌లో కల్తీ మద్యం సేవించిన ఘటనలో మృతుల సంఖ్య 38కి చేరింది. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో ఈ ఘటన జరగడంతో అసెంబ్లీలో బీజేపీ సభ్యులు సీఎం నితీష్ కుమార్ ను నిలదీస్తున్నారు. బుధవారం అసెంబ్లీలో బీజేపీ సభ్యులు నితీష్ ప్రజలకు సమాధానం చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ ఘనటపై సీఎం నితీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఏం చేస్తున్నారు.. తాగి వచ్చారా, అరవకండి అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. నితీష్ వైఖరికి నిరసనగా బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

CM Nitish Kumar: బీహార్ సీఎం నితీష్ కుమార్ ఉగ్రరూపం.. సభలో బీజేపీ నేతలపై మండిపడ్డ సీఎం ..

గురువారం కూడా బీహార్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నువ్వానేనా అన్నట్లు మాటల యుద్ధం సాగింది. నితీష్ కుమార్ రాజీనామా చేయాలంటూ సభలో ప్రతిపక్ష సభ్యులు నినదించారు. దీంతో మరోసారి ఆగ్రహంతో ఊగిపోయిన నితీష్.. ప్రతిపక్ష సభ్యులపై మాటల దాడికి దిగారు. కల్తీ మద్యం తాగిన వ్యక్తి చనిపోవడం ఖాయం. ప్రజలే అప్రమత్తంగా ఉండాలి అంటూ నితీష్ అన్నారు. కొంత మంది తప్పులు చేస్తుంటారు. మద్యం సేవించేవాడు ఖచ్చితంగా చనిపోతాడని నితీష్ అన్నారు.

CM Nitish Kumar : బీజేపీ యేతర పార్టీలన్నీ ఏకమైతే అది థర్డ్‌ ఫ్రంట్‌ కాదు .. మెయిన్‌ ఫ్రంట్‌ : సీఎం నితీష్ కుమార్

బీహార్ లో మద్య నిషేధం లేనప్పుడు కూడా కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోయారని, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. బీహార్‌లో మద్యం నిషేధించబడినందున, నకిలీ మద్యం విక్రయిస్తున్నారు. ప్రజలు దానిని తాగి చనిపోయారు. పేదలను లక్ష్యంగాచేసుకొని కొందరు కల్తీ మద్యం విక్రయాలు చేస్తున్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు. మద్యపాన నిషేధంతో చాలా మంది మద్యానికి స్వస్తి పలికారు. మద్యానికి సంబంధించిన వ్యాపారం ఎవరూ చేయవద్దు. ఏదైనా ఇతర వ్యాపారాలకు లక్ష రూపాయల వరకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నితీష్ కుమార్ అన్నారు.

 

కల్తీ మద్యం ఘటనలో మరణించిన వారి సంఖ్య 38 వరకు చేరిందని మృతుల బంధువులు పేర్కొంటున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు కేవలం ఆరుగురు మాత్రమే మరణించారని చెబుతోంది.